Saturday, August 20, 2022

అభిరుచులు సాధనకు ముందుకు సాగనివ్వటంలేదు ఎలా ?

       💖💖 "306" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
"అభిరుచులు సాధనకు ముందుకు సాగనివ్వటంలేదు ఎలా ?"

"సాధనకు అభిరుచులను ముడి పెట్టుకోవడం తొలి అడ్డంకి. మనసుకు సంబంధించిన ధ్యానంతో స్థలానికి, కాలానికి ఏ సంబంధమూలేదు. ఏ స్థలంలోనైనా, ఏకాలంలోనైనా దైవాన్ని స్మరించేందుకు అవకాశమున్న మనసుకు మనమే నిబద్ధతను, నిబంధనలను విధించుకుంటున్నాం. మనకి బాగా ధ్యానం చేయాలని ఉంటుంది. కానీ అందుకు ఒక అనువైన స్థలం, వాతావరణం లేదన్న కారణాన్ని తీసుకొని వాయిదా వేస్తుంటాం. శారీరక సౌకర్యానికి, మనసుచేసే జపానికి ఏ సంబంధమూ లేదు. మన అభిరుచులను ముడి పెట్టుకోవడమే అవరోధం. మనసుకు సంబంధించిన శాంతిని, భౌతిక విషయాలను కలపాలనుకోవటం నీరు-నూనెలను కలపటం లాంటిదే ! ఎలాంటి సాకులు, వంకలులేని సాధనకు ఉపక్రమించగలిగితే మనలోని నిశ్శబ్దాన్ని వినే అర్హత వస్తుంది. మనం ఉండటమే దైవానుగ్రహం అన్న సత్యదృష్టి వస్తే గానీ మనసు భౌతిక విషయాలతో నిమిత్తంలేని శాంతిని పొందగలుగుతుంది !"

"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"

No comments:

Post a Comment