భారతీయం అంటే ఈ క్రింది మేసేజ్ చదివితే అర్ధమవుతుంది..!
🙏🙏 🙏🙏🙏
కారుమేఘాలు కమ్ముతున్నాయి
ఏక్షణంలో అయినా...వర్షం విపరీతంగా కురుస్తుంది...!
వేసే ముగ్గు...వర్షంలో కలుస్తుంది...అయినాఆమె ముగ్గువేస్తోంది... !
అదీ...సంప్రదాయం! 🙏
అంతర్జాతీయ ఖ్యాతినార్జించి
అమెరికాలో ఉంటున్న వైద్యుడు...సొంతూరు వచ్చినప్పుడల్లా
పాఠాలు చెప్పిన పంతులుకు
పాదాభివందనం చేస్తాడు…!
అదీ ... సంస్కారం ! 🙏
ఖగోళ శాస్త్రాన్ని
నమిలి మింగిన నిష్ణాతుడు...నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తే గానీ...ఆహారం గ్రహించడు…!
అదీ...నమ్మకం ! 🙏
పరమాణు శాస్త్రాన్ని
పిండి పిప్పిచేసిన పండితుడు...మనవడి పుట్టు వెంట్రుకలు
పుణ్యక్షేత్రంలో తీయాలని
పరదేశం నుండి పయనమై వస్తాడు…!
అది...ఆచారం ! 🙏
అంతరిక్ష విజ్ఞానాన్ని
అరచేతబట్టిన అతిరధుడు...అకుంఠిత నిష్ఠతో
పితృదేవతలకు
పిండ ప్రదానం చేస్తాడు…!
అదీ...సనాతన ధర్మం ! 🙏
అత్తింటికి వెళ్లేముందు
ఇంటి ఆడబడుచు
పెద్దలందరికీ
పాదాభివందనం చేసి
పయనమవుతుంది…!
అదీ...పద్ధతి ! 🙏
పెద్ద చదువులు చదివినా
పెద్ద కొలువు చేస్తున్నా ...పేరు ప్రఖ్యాతులున్నా
పెళ్లి పీటల మీద...వధువు
పొందికగా ఉంటుంది…!
అదీ .. సంస్కృతి !🙏
భార్య పక్షవాతానికి లోనయ్యింది
మంచం దిగలేని పరిస్థితి
తనంతట తానుగా...తను వీడ్చలేని స్థితి...భర్త భరోసాగా నిలచి...భారమంతా మోస్తాడు-అన్నీతానై...అలిని సాకుతాడు…!
అదీ ...దాంపత్యం! 🙏
బ్రతికే అవకాశం తక్కువ
వెంటిలేటర్ పై వేచిచూస్తే
బ్రతికితే బ్రతకొచ్చు !
లక్షల ఖర్చు భరిస్తూ
వెంటిలేటర్ పై పెడతారు… !
అదీ ...అనుబంధం! 🙏
ఇది సమస్తం - తరతరాలుగా వస్తున్న సంప్రదాయ భారతీయ ఆత్మ తత్త్వం. 👌
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment