Sunday, August 14, 2022

ఆణిముత్యం. మనం అందరం జీవితంలో విజయం సాధించాలని కష్టపడుతూ ఉంటాం.

 ఆణిముత్యం.

మనం అందరం జీవితంలో విజయం సాధించాలని కష్టపడుతూ ఉంటాం.

అసలు విజయం అంటే ఏంటి ?? మన నిజజీవితంలో రాత్రికి రాత్రే గుర్తింపు తెచ్చుకొని గొప్పవాళ్ళు అయిన వాళ్ళను చూస్తుంటాం, అలాగే ఎన్నో ఏళ్ళు కష్టపడి విజయానికి పునాదులు వేసుకున్నవాళ్లను
చూస్తుంటాం ,.

ఇందులో కొంతమంది ఆ విజయ పరంపరను కొనసాగిస్తూ ముందుకు వెళ్తే మరి కొందరు ఆ గెలుపును కొనసాగించలేక తెరమరుగు అయిపోతుంటారు.

కొందరు పడి లేస్తే చాలామంది లేచి పడుతుంటారు.
అనుకున్నది సాధించడానికి మనల్ని మనం కోల్పోతే సాధించిన విజయానికి అర్ధమే ఉండదు.
ప్రపంచంలో మంచివాళ్ళు అలాగే విజయం సాదించినవాళ్లు వుంటారు, కానీ విజయం సాధించి అనుకున్న ఎత్తుకు చేరుకున్న తర్వాత కూడా ఎవరు అయితే మంచిగా వుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు..

ఎక్కడో ఎక్కడో విన్నది చదివినది..

మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment