Monday, August 1, 2022

భక్తుడు: భయంకరమైన మృత్యుభయాన్ని దాటేదేట్ల?

 అరుణాచల👏

"నేను"ఎవరు?

భక్తుడు: భయంకరమైన మృత్యుభయాన్ని దాటేదేట్ల?

భగవాన్: మృత్త్యభీతి నిన్నెప్పుడూ ముట్టడిస్తోంది? గాఢ నిద్రలో వున్నప్పుడు-మత్తు మందు తీసుకున్నప్పుడు నీకు దేహం తెలియదు, అప్పుడు మృత్యు భయం వుండదు.

జాగ్రత్తలో వున్నప్పుడే దేహము ఇతరులు ప్రపంచం తెలుస్తున్నాయి. నీవు నీ సత్యమైన ఆత్మలో నిలకడ కలిగి ఉన్నప్పుడు నీకు దేహము, పరుల ప్రపంచము కనబడవు. అప్పుడు మృత్యుబీతే ఉండదు! అయితే సత్యాత్మలో నిలకడ కలిగి ఉండటాన్ని దేహంలో ఉండగానే ప్రపంచంలో ఉండగానే సాధించాలి.🙏 🙏🙏🙏

No comments:

Post a Comment