Saturday, August 20, 2022

వాక్కులకు శక్తి యుంది. క్రమంగా అది తన ప్రభావం చూపనే చూపుతుంది.

 కలెక్టర్ :
 భగవాన్! కర్మను బోధింపను గదా శ్రీకృష్ణుడు భగవద్గీతను చెప్పింది? 

మహర్షి : 
భగవద్గీత ఏమన్నది? అర్జునుడు పోరాడను(కర్మను చేయను) అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు ....

కర్మను చేయనని అన్నంత కాలం నీకు కర్తృత్వ(నేను కర్తను) బుద్ధి ఉన్నది. చేయడానికి గాని, మానడానికి గాని, నీవు ఎవ్వరవు? 'కర్తను నేను' అన్న తలపు మానుకో.

 ఆ సర్వ శక్తి నిన్ను ఆడిస్తున్నది. ఆ శక్తికి లొంగను అనడంలోనే నీ ఒప్పుదల కనిపిస్తున్నది. అంతకన్నా ఆ శక్తిని గుర్తించి, లొంగి, దానికి ఉపకరణ మాత్రంగా నిలువు. అట్లాకాదని భీష్మించావా, బలవంతంగానైనా నిన్ను ఆ శక్తి ఆకర్షించి తీరుతుంది.

ఆత్మలో స్థిరపడి, కర్తృత్వభావన వీడి, సహజంగా నడుచుకో; అపుడు ఆ కర్మఫలం నిన్ను అంటదు. పౌరుషము, శౌర్యము అంటే అది.

కలెక్టర్ : 
అలా అయితే ఆత్మాన్వేషణ చేసేవానికి ఈ సమాధానంవల్ల ప్రయోజనం ఏమి?

మహర్షి :
 (గీతాచార్యులు)వాక్కులకు శక్తి యుంది. క్రమంగా అది తన ప్రభావం చూపనే చూపుతుంది. 

No comments:

Post a Comment