Monday, October 24, 2022

మంచి మాట..లు(07-10-2022)

శుక్రవారం:- 07-10-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా కూడ గమ్యం చేరాల్సిందే.. విజయం సాధించాక ముళ్ల దారి పూల వనం గా మారుతుందు భవిష్యత్ కొరకు, దానికి ఆలోచనను ,శ్రమ ను ఆయుథంగా చేసుకుంటే గమ్యం నీ ముందే నిలుస్తుంది

జ్ఞానం అనేది మనం సంపాదిస్తేనే వచ్చేది కాదు మనలోని అజ్ఞానాన్ని విడిచి పెడితేనే వచ్చేది

ఆస్తులు ఉన్నోడికి ఆకలి ఉండదు ఆకలి ఉన్నోడికి ఆస్తులు ఉండవు ఈరెండు ఉన్నోడికి తినడానికి మంచి ఆరోగ్యం ఉండదు,(అందరిలో కాదు కొందరిలో )

మనకు దేవుడు ఏదైనా లోపం ఇస్తే అది మన మనుస్సు ల్లో దాగిన లోపాలను సరిచేసేందుకె, ఇంకో చోట దానికి మించిన బలం ఇస్తాడు..దానితో ఆశయం సాదించుకోవటానికి

పడిపోయినపుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి,, కోల్పోయినపుడు బాధపడకూడదు,, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి.

ఓటమి అంటే జీవితం అంతం కాదు,,అదే గెలుపుకి అసలైన ఆరంభం, సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి, గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది, అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని.

మనిషి మానసికంగా కుంగిపోవడం మొదలెడితే రోగాలు కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్థాయి, విజయాలకు మూలం మనసు,, శాంతంగా నిబ్బరంగా ఉంటే ఆలోచన తో ఏదయినా దేన్నైనా సాధించవచ్చు .
       
ఆశయం గొప్పదైతే, ఆలోచన పవిత్రమైతే, ఆత్మబలమే ఆయుధమైతే,
విజయం తప్పక వరిస్తుంది.

ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది, అలాగే బాధ సగమవుతుంది. ఎప్పుడు ఆత్మీయులను మీ మాటల ద్వారా కోల్పోకండి..

సేకరణ ✒️AVB సుబ్బారావు

No comments:

Post a Comment