Monday, October 10, 2022

46 సెకండ్స్ లోనే ఇన్ని తప్పులున్నాయా..? మరి సినిమా మొత్తం ..☹️ ఎలా ఉండబోతోంది..?

 46 సెకండ్స్ లోనే ఇన్ని తప్పులున్నాయా..?
మరి సినిమా మొత్తం ..☹️ ఎలా ఉండబోతోంది..?

ఇందులో చాలా కల్పితాలు ఉన్నాయి.

1. రాములు వారు అలా ఒంటికి కవచం ధరించలేదు

2. సీతామత అశోకవనంలో ఉన్నప్పుడు కూడా జడ వేసుకొని ఉంది అని సుందరకాండలో స్పష్టంగా చెప్తారు.

కానీ ఇక్కడ విరబోసుకొని చూపించాడు.

3. రావణాసురుడు గబ్బిలం మీద తిరగడు.

పుష్పక విమానాల్లోనే తిరుగుతాడు

4. ఆయనది గబ్బిలాల కోట కాదు "బంగారు కోట" కానీ ఇక్కడ ఎలా చూయించాడు.

5. రాముల వారు వానర సేన సహాయం తీసుకున్నాడు కానీ గొరిల్లాల సహాయం కాదు.

6. రావణాసురుడు కిరీటం లేకుండా అసలు ఉండడు.
రాముల వారి బాణాల పరంపరకి ఆ కిరీటం కూడా నేల పడినట్టు యుద్ధ కాండలో చెప్తారు.

7. రాముల వారికి పాదరక్షలు ఉండవు కానీ ఇక్కడ చూడు.

మర్చిపోయావా వశిష్టుడి సలహా మేరకు భరతుడు రాముల వారి పాదుకలు తీసుకొని వెళ్లి రాజ్య పరిపాలన చేసిన విషయం.

8. రావణుడి పది తలలు ఒకేలా ఉంటాయి అంతే కానీ ఒక దాని మీద విభూతి ఇంకో దాని మీద ఏమీ లేకుండా ఉండవు.

9. ఇంకో విషయం రావణుడి తలలు 10 కూడా కరుసుకున్నట్టు straight గా అంటే ఒకే క్రమంలో ఉన్నట్టు చెప్తారు కానీ ఇక్కడ ఎగుడు దిగుడు.

10. రావణాసురుడికి మాత్రం విభూతి స్పష్టంగా చూయించారు కానీ రాములవారికి హనుమకి లక్ష్మణుడికి ఇక ఆ వానర సేనకు ఏమైనా తిలక ధారణ చూయించారా?

11. సీతామత ఎల్లవేళలా తన చీరతో తన తలను కప్పుకొని ఉండేది అని మనకి శ్రీరామాయణం చెబుతుంటే మరి ఇక్కడ ఏంటి? ఇలా పెట్టారు.

ఇంకా క్లియర్ గా చూస్తే చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించుకోండి, ఆ  bollywood వాళ్ళు నిదానంగా మన పురాణ కథలు తీస్తున్నాము అనే పేరుతో  మన ధర్మానికి మూల స్థంభం ఐన "సాంప్రదాయాన్ని" దెబ్బ కొడుతున్నారు.

ఐతే  ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ bollywood వాళ్ళు మన సాంప్రదాయం దెబ్బకొట్టడానికి మన "south india stars" ని వాడుకోవడమే.

ఇప్పటికైనా మేల్కొనండి. మన శ్రీరామాయణం యుద్ధానికి మాత్రమే కాదు ధర్మానికి, సాంప్రదాయానికి, సకల శాస్త్రాలకు నిలయం. 

ఒక ధర్మం నిలబడాలంటే దానికి మూల స్థంభం "సాంప్రదాయమే". 

ఆ సాంప్రదాయం మీద దెబ్బ కొడితే ఇక ఆ ధర్మం నిలబడదు

No comments:

Post a Comment