బరువు తగ్గాలంటే డైటింగ్, వ్యాయామాల్లో ఏది ముఖ్యమైనది? మీరు బరువు తగ్గిలి అంటే నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం
అధికబరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవొచ్చు :
Gym కి వెళ్లకుండా
ఖరీదైన ఆహారపదార్దాలు లేక మందులు అవసరం లేకుండా
సులువుగా మరియు శాశ్వితంగా
అధిక బరువు అసలు ఎలా వస్తుంది
బరువు తగ్గాలి అంతే ముందు అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. మనం అవసారిణికి మించి తిన్నపుడు, ఆహారం క్రొవ్వు రూపములో శరీరంలో భవిషత్ అవసరాలకోసం భద్రపరచబడుతుంది. దీనివలన మనం బరువు పెరుగుతాం. మనం అవసరానికన్నా తక్కువ తిన్నపుడు, ఈ క్రొవ్వు కరిగి శరీర అవసరాలకు వాడబడుతుంది. అప్పుడు మనం బరువు తగ్గుతాం.
బరువు తగ్గాలి అంటే మన అవసరానికంటే కొంచం తక్కువ తినాలి మరియు కొంచం శారీరక శ్రమ పెంచాలి.
1.-బరువు ఎలా తగ్గాలి?
మీ బరువు ప్రతి ఉదయం check చేసుకోవాలి
ప్రతిఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత కాళీ పొట్టతో వున్నపుడు, బరువు check చేసుకోవాలి. ఈ క్రింది చిట్కాలవల్ల ప్రతి వారం కొంచం బరువు తగ్గుతారు. ప్రస్తుత బరువుని గత వారం బరువుతో పోల్చి చుడండి. ఒకవేళ తగ్గట్లేదు అంటే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో కనుక్కోండి.
2.- మీ పొట్ట (stomach) పరిమాణం తగ్గిచుకోండి
తినేటప్పుడు, మీ stomach పూర్తిగా నిండటానికి కొంచం ముందే తినటం ఆపాలి, మరలా ఆకలి వేస్తే కొంత సమయం తరవాత తినాలి.
సాధారణంగా stomach 100% నిండుతున్నపుడ మన మెదడు గ్రహించి తినటం ఆపమనే సందేశాన్ని మనకు పంపిస్తుంది. కానీ మీరు తినటం అలాగే కొనసాగిస్తే, stomach వ్యాకోచిస్తుంది.
మీరు ఎప్పడూ 10% అధిక ఆహారం తీసుకోవటానికి అలవాటు పడితే, మీ stomach వ్యాకోచించి 110% అవుతుంది. మీ మెదడు కూడా ఇది గ్రహించి ఎప్పడూ 110% ఆహారం తీసుకున్నాకే తినటం ఆపమనే సందేశాన్ని పంపిస్తుంది. అంటే ప్రతిసారి మీరు 10% ఎక్కువు ఆహారం తిని బరువు పెరుగుతుంటారు.
ఉదాహరణకు మీ స్టొమక్ capacity 4 చపాతీలు అనుకోండి, కానీ మీరు ఎప్పుడు 5 చపాతీలు తింటారు. అంటే మీ మెదడు 5 చపాతీలు తీసుకున్నాకే తినటం ఆపమనే సందేశాన్ని పంపిస్తుంది. అంటే ప్రతిసారి మీరు 10% ఎక్కువు ఆహారం తిని బరువు పెరుగుతుంటారు.
సినిమా hero, heroines బరువు తగ్గటానికి bariatric surgery చేయించుకుంటారు. అదికూడా ఈ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సర్జరీ లో పొట్టపరిమానాన్ని staples మరియూ bands వాడి 25% కు తగ్గిస్తారు. దీనిద్వారా కొంచం ఆహారం తీసుకోగానే వారి stomach నిండి ఇంకా తినలేరు. తక్కువ ఆహారం తినటం వలన వారు బరువు తగ్గుతారు. ఈ సర్జరీ చాల ఖర్చుతో కూడినది మరియూ ప్రమాదం. కానీ మన stomach capacity సహజంగా తగ్గించుకొని బరువు తగ్గించుకోవచ్చు
మీ stomach 85% నిండగానే తినటం ఆపివేయాలి. మిగిలిన ఆహారం 30 నుండి 40 నిమిషాల తరువాత అవసరం అయితే తీసుకోవాలి. పైన చెప్పిన చపాతి ఉదాహరణ మల్లి తీసుకోండి. ఒకేసారి 5 ఛాతీలు తినకుండా, 3 చపాతీ తిని ఆగండీ . మీ stomach 75% నిండుతుంది. మీకు కొద్దిగా ఆకలి అనిపిస్తుంది ఎందుకంటే మీ stomach capacity కంటే 1 చపాతీ తక్కువ మరియూ మీ అలవాటుకంటే 2 చపాతీలు తక్కువ తిన్నారు కనుక. కానీ మీ stomach పూర్తి కాళీ లేదుకనుక మీరు తట్టుకోగలరు. ఒక 30 నుండి 40 నిమిషాల తరువాత ముందు తిన్న చపాతీలు కొద్దిగా అరిగిపోయి పొట్ట కొద్దిగా కాళీ అవుతుంది. ఇప్పుడు అవసరమనుకుంటే మిగిలిన 1 లేక 2 చపాతీలు తినండి. అయినాకూడా మీ stomach 85% మించి నిండదు.
ఇలా కొన్ని రోజులు అలవాటుపడితే మీ stomach 85% నిండగానే మీ మెదడు, తినటం ఆపమనే సందేశాన్ని పంపిస్తుంది. అందువలన మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు మరియూ బరువు తగ్గుతారు.
చాలామందికి రెండవసారి ఆహారం తీసుకోవటం వీలుపడదు. అందుకని 40 నిమిషాల తరువాత 1 లేదా 2 చపాతీలకి బదులు కొన్ని పండ్లు లేదా కూరగాయలు తినటం అలవాటు చేసుకోండి (bananas, apples ,carrots, cucumbers etc.) .
4.-మీ stomach ని తెలివిగా నింపండి
ఒక apple తింటే మీ స్టొమక్ నిండుతుంది, దానికి బదులు రెండు apples తీసుకునో ఒక glass juice చేసి తాగినా stomach నిండుతుంది. కానీ juice కి రెండు ఆపిల్స్ వాడటం వలన మీకు రెండు రేట్లు calories లభిస్తాయి మరియూ బరువు త్వరగా పెరుగుతారు. juices liquid form లో ఉండటం వలన త్వరగా జీర్ణం అయ్యి మీకు తిరిగి త్వరగా ఆకలి వేస్తుంది.
అలాగే 3 చపాతీలకు బదులు, 2 1/2 చపాతీలు ఎక్కువ curry తో (vegetables, pulses, beans తో చేసిన) తినవచ్చు. మూడు సాదా దోసెలకు బదులు రెండు onion దోసెలు తినండి. ఉప్మా లాంటి అల్పాహారం లో vegetables మరియూ meal makers వంటివి కలిపి వండండి.
ఇలాంటి tricks ప్రతి వంటకానికి అమలు చెయ్యవచు. ఇలా చెయ్యటం వలన మీరు తీసుకునే ఆహార పరిమాణం తగ్గించకుండానే బరువు తెగ్గించుకోవచ్చు . ఇందువల్ల తక్కువ calories మరియూ ఎక్కువ proteins మరియూ పీచుపదార్థం లభిస్తుంది.
https://t.me/HelathTipsbyNaveen
5.-పీచు పదార్థం ఎక్కువగా తెస్కుకోండి
చాలా vegetables మరియూ fruits (bananas, apples, carrots etc.) పీచు పదార్థం లభిస్తుంది. పీచూ పదార్థం వలన మన stomach నిండుతుంది కానీ మన శరీరం దానిని జీర్ణించుకోదు. అంటే పీచు పదార్థం వలన మీకు ఎటువండి calories రావు మరియూ బరువు పెరగరు కానీ ఆకలి తగ్గుతుంది. అందువలన ఇది బరువు తగ్గటానికి చాల బాగా పనిచేస్తుంది. పూర్తిగా polish చేసిన బియ్యం కి బదులు, తక్కువ polish చేసిన బియ్యం, మరియి చిరు ధాన్యాలు తినండి (ఊడలు, అరికెల, కొర్రలు లాంటివి )
పీచు పదార్థం blood sugar ని కంట్రోల్ చెయ్యటానికి కూడా సహాయ పడుతుంది. అలాగే మలబద్దకాన్ని(constipation) కూడా నివారిస్తుంది.
6.-శారీరక శ్రమ పెంచండి
శారీరక శ్రమ వలన శరీరంలో వున్నా క్రొవ్వు కరిగి ఆరోగ్యంగా వుంటారు.
lift కి బదులు మెట్లని వాడండి.
తక్కువ దూరానికి నడిచి వెళ్ళండి లేదా సైకిల్ వాడండి, బైక్ / కార్ కి బదులు
ఈత మరియూ డాన్స్ నేర్చుకోండి
ఇష్టమైన ఆటలు ఆడండి (badminton, cricket, tennis, volleyball etc.)
మీరు వృత్తిరీత్యా ఎక్కువసేపు ఒకేచోట కూర్చొనే వారు అయితే. ఎక్కువగా నీరు త్రాగండి. దీని ద్వారా ప్రతి 40 నిమిషాలకి ఒకసారి automatic గ లేసి washroom కి వెళ్తుంటారు.
ఫోన్ మాట్లాడే సమయంలో వీలుంటే walking చేస్తూ లేదా నిలబడి మాట్లాడటం నేర్చుకోండి. మీరు ఒకరోజు లో 30 నిముషాలు phone మాట్లాడే వారు అయితే ఆ సమయంలో చక్కగా walking చేస్తూ ఎక్కువ సద్వినియోగము చేసుకోవచ్చు
ఇంకా కొన్ని నవీన్ రోయ్ సలహాలు
7.-ఒక kg బరువు తగ్గటం వలన మీ మోకాలుమీద 3 నుండి 4 కేజీల బరువు తగ్గుతుంది
8.-అధిక బరువు BP మరియూ diabetes వంటి దీర్ఘకాలిక జబ్బులకు దారితీస్తుంది
9.-ఆకలి లేనప్పుడు ఎప్పుడు తినకూడదు.
10.-Snacks ఏవైనా చిన్న size వి కొనండి. ఉదాహరణకు large pizza కి బదులు small pizza . అలాగే small chocolate, small burger. (Diminishing marginal utility for food చదవండి)
11.-భోజనం లేదా అల్పాహారం చేసిన వెంటనే tea / coffee / ice cream / fruits / juice లాంటివి తినకూడదు. కనీసం 30 నుండి 40 నిమిషాల విరామం ఇవ్వండి. లేకపోతె stomach పరిమాణం పెరుగుతుంది
12.-చిన్న plate లో తినటం వల్లనా తక్కువ ఆహారం తింటారు
13.-మీ ఇంట్లో ఎవరైనా అధిక బరువుంటే మీరుకూడా అధిక బరువు ఉండటానికి అవకాశం ఎక్కువ. కొన్నిసార్లు genes దీనికి కారణం. కానీ చాల సందర్భాలలో మీ జీవన విధానం, ఆహార అలవాట్లు మీ కుటుంబంలో వారికీ similar గా ఉండటం దీనికి కారణం. అంతే గాని ఇది వంశపారంపర్యం కాదు.
14.-కొన్ని weight-loss programs లో మిమ్మల్ని ఆహరం చాలా తక్కువ తీసుకోమని support గా nutrition powder /tablets ఇస్తుంటారు. ఇటువంటి వాటివలన బరువు తాత్కాలికంగా తగ్గుతారు కానీ ప్రమాదకరమైన side-effects ఉంటాయి.
15.-శాశ్వితంగా బరువు తగ్గటానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవటం, శారీరక శ్రమ పెంచటం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
No comments:
Post a Comment