💖💖💖
💖💖 *"357"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"రూప, నామ, జపాదులు ఎంత కాలం కొనసాగించాలి ?"*
*************************
*"మనకు నామరూపాలపై ఇష్టం ఉంది. ఒక క్షణంలో ఒక విషయంపైకి మాత్రమే ప్రసరించగలిగిన శక్తి మనసుకుంది. కళ్ళు మూసుకుంటే ఒక రూపాన్ని మించి చూడగలిగే అవకాశం మనసులో లేదు. వీటన్నింటినీ కలిపి మనం జపధ్యానాదులుగా సాధన చేస్తున్నాం. దీని వల్ల ఏకాగ్రతను అలవర్చుకున్న మనసు ఏ విషయంలోనైనా అదే స్థిరత్వాన్ని కలిగి ఉండటం ద్వారా మన నిత్యజీవితం శ్రద్ధాసక్తులతో సాగుతుంది. విలువిద్య నేర్చుకునేవాడు గురి కోసం ఏదోక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దాన్ని సాధిస్తాడు. విద్య నేర్చుకునేది గురి కుదరటానికే గాని ఎప్పుడూ ఆ లక్ష్యాన్నే కొట్టడం కోసం కాదు. అలాగే జప ధ్యానాదుల్లో మనం ఎంచుకున్న రూపం, నామం మన మనసుకు శ్రద్ధ, ఏకాగ్రత నేర్పడానికే గానీ ఆ రూప, నామ విధానాలనే అంటి పెట్టుకోవటానికి కాదు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment