Xv. X2. 1-7. 021022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఏవైపు తలపెట్టుకుని నిద్రపోవాలి?
➖➖➖✍️
ఉత్తర, పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ…
రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు.
అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.
భూమి ఒక పెద్ద అయస్కాంతం. మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును.
ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు పిలుస్తారు. విశ్వములోని అన్నింటి ప్రభావం, శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును.
ఉత్తరదిక్కుకు ఆకర్షణ(అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును.
అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నదని మన పురాణాలలో ఉన్నది.
మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం. శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.
వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును.
ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం. బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం. దీనినే ‘పుణికి’ అని ‘బ్రహ్మకపాలం’ అని అందురు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది.
మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.
దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని "వెక్టార్ " ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును.
యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.
శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును. ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తనశక్తిని, వర్ఛస్సును కోల్పోవును. విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును.
విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును, వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను.
కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణం చెంది తలభారం, బాధ, అలసట, నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం, తిమ్మిరి, నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును. కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమీ సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.
ఇదేవిధముగా పడమట దిక్కు కూడా. ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు. సర్వప్రాణులకు ఆధారభూతము , జగత్తును పోషించువాడు. సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునో అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురించిన కలుగును.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment