ఈరోజు మంచి మాటలో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం.
జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు, కేవలం నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది.
కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు
కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు,
కొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు,
ఇంకా కొందరు పడిపోయి ఎలా నిలబడలో నేర్చుకుంటారు,
జీవితం అనేది ఒక పాఠశాల, ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది..
మనిషి జీవితంలో, ఆపదలకు మూలం అజాగ్రత్త, పతనానికి మూలం అహంకారం,,
జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి, మనకు మంచి చేసిన వారిని మరణించే క్షణం వరకూ గుర్తుంచుకోవాలి,,
కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది,, అందుకే దుష్టులతో స్నేహం మంచిది కాదు,,
ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు, ఇది సత్యం,,
_మనసు చెడు ఆలోచనలతో నిండిపోయినప్పుడు, మంచి చెప్పేవారు శత్రువులు గాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు,,
మీ పెదవుల మీద అతికించుకున్న చిరునవ్వు ను చూసి నువ్వు ఆనందంగా ఉన్నావని అందరు అనుకుంటున్న క్షణంలోనే నీ కళ్ల లోని భాదను పసిగట్టగలిగినవారే స్నేహితులు
మన జీవితంలో ప్రతి మలుపులోను ప్రమాదాలుంటాయి.. వాటినీ మనం దైర్యంతో ఎదురుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ వాటికీ బయపడి ప్రయాణమే ఆపితే జీవితానికి అర్థం లేదు
ప్రస్తుత పరిస్థితులబట్టి మనం కొన్ని అలవాటు చేసుకోవాలి.అది బంధమైన వస్తువులైన మనుషులైనా, అందుకే అన్నిటికీ మనము సిద్ధంగా ఉండేలా మన మనసు కు శిక్షణ ఇచ్చుకోవాలి
జీవితం ఎంతో చిత్రంగా ఉంటుంది.. ఎవరు తెలియని ఈ ప్రపంచంలోకి ఏమి తెలియకుండా వస్తాము.. తెలియకుండా వచ్చినా మననే సర్వస్యం అయ్యేలా ఎన్నో బంధాలు కలుపుకుంటాము.. చివరికి ఎవరికీ చెప్పకుండానే అన్నిటిని తెంచుకొని పోతాము
మనం పుడితే తల్లి సంతోషపడాలి, మనం పెరిగితే తండ్రి ఆనందపడాలి , మనం బ్రతికితే ఈ సమాజం సంబరపడాలి, మనం చస్తే స్మశానం కూడా కన్నీరు పెట్టాలి . అదే మన జీవితం కావాలి నేస్తమా ! .
నీవు మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ ! మంచి మనసును కలిగివుండడం అనేది నీ చేతుల్లోనే ఉంది . నువ్వు సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది .
ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట లా ఉంటుంది ఒకరి జీవితం ఇంకొకరికి చులకన గా ఉంటుంది , ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ గా ఉంటుంది . ఒకరి బాధ ఇంకొకరికి బరువు గా ఉంటుంది . ఒకరి పరువు ఇంకొకరికి ఎగతాళిగా ఉంటుంది . ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం గా ఉంటుంది . ఒకరి బలహీనత ఇంకొకరికి బలం లా ఉంటుంది .
శాసనాలు చేసేటోళ్లే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే పట్టాలు పట్టుకున్న పట్టభద్రులు పైసలకు అమ్ముడు పోతుంటే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం కాదా ? నీతికి చెదలు పట్టవా
క్యాలెండర్ లో పేజీలు మాత్రమే ఉంటాయి కాలం గడిచిపోతుంది. కాలంలో వెనకకు తిరిగి చూస్తే ఏదైనా మనం చేసిన మంచి పనులు కానవస్తున్నాయా, ఒకసారి సరి చూసుకోండి.లేకపోతే సరిచేసుకోండి .మనిషి కాలం వెంట పరిగెడుతున్నా, ఎప్పుడో ఒకసారి అగక తప్పదు అది ఎప్పుడో ఎవరికీ తెలియదు ముందుగా..
సేకరణ.మానస సరోవరం

No comments:
Post a Comment