Sunday, October 16, 2022

****కోరిక మొదలైన తర్వాత దాని పర్యావసానాన్ని నియంత్రించుకునే మార్గాలు ఏమిటి ?

       💖💖 *"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     

*"కోరిక మొదలైన తర్వాత దాని పర్యావసానాన్ని నియంత్రించుకునే మార్గాలు ఏమిటి ?"*
*************************

*"కోరిక మొదలైతే ఇక దాని పర్యావసానాన్ని నియంత్రించలేము. ఫలానాది కావాలనుకోవటం, ఫలానా పద్ధతిలోనే ఉండాలనుకోవటం ఇలా రకరకాలుగా కోరిక కలిగే ముందే దాని ఫలితంపట్ల అవగాహన కలిగిఉండాలి. మంచి చెడులు, సాధ్యాసాధ్యాలు, ఉచితానుచితాలు ఆలోచించుకోవాలి. మనం తయారు చెయ్యని విత్తనం నుండి వచ్చే పంటను మనం అనుకునేట్లు రావాలని కోరుకుంటాం. వేప విత్తనం నాటి మామిడి పంట ఆశించటం తగునా ? విత్తనం ఏర్పాటులోనే దాని పంట కూడా నిర్ణయించబడివుంది. కోరికలు, ఆలోచనల విషయంలో నియంత్రణతోపాటు దాని పట్ల ఎరుక కలిగివుండాలి. కానీ ఈ విషయంలో మన ప్రమేయం లేనంతగా నియంత్రణ కొరవడుతుంది. నియంత్రించటం ద్వారా వచ్చే శాంతిని, ధ్యానాన్ని కావాలని కోరుకుంటాం. అశాంతిలో లభిస్తున్న స్వల్ప విరామాన్ని ధ్యానం అనుకుంటున్నాం. అది కేవలం భ్రమ. ఆ భ్రమ నుండి అసలు అశాంతికి తావులేని జ్ఞానాన్ని సాధించే స్థితికి ఎదగాలి. అందుకు మన జీవన అవసరాలను గుర్తెరిగి వాటిని పెనవేసుకొని మనను బాధిస్తున్న కోరికలను నియంత్రించుకోవాలి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
          🌼💖🌼💖🌼
                🌼🕉️🌼
           

No comments:

Post a Comment