Sunday, October 16, 2022

మనిషి చుట్టు మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి కానీ, దేన్ని వదిలేయాలి, దేన్ని తీసుకోవాలి అనేదాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది.

 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి 
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ            
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092                                                   🙏🏽🙌🏿🌹🙊🙉🙈 🌹🙌🏿🙏🏽
🙏🏽?🏼కష్టాలు, బాధలు, విఘ్నలు మనుసును బలహీనపరుస్తాయి. శాశ్వతంగా ఉండవు అవి ఆకాశంలో మేఘాలాంటివి. కొంతసేపు సూర్యున్ని అడ్డుకొని కారుచీకటిని ఇవ్వొచ్చు మబ్బులు కదిలి తొలగి పోగానే యధావిధంగా వెలుగు ప్రసరిస్తుంది.అదేవిధంగా జీవితంలో కష్టాలు, బాధలు శాశ్వతంగా ఉండవు.
కష్టాలు, బాధలు, విఘ్నలు కొందరికే పరిమితం కాదు. అవి అందరిని ఏదో ఒక సమయంలో పలకరిస్తూనే ఉంటాయి. కష్టాలు, బాధలను తట్టుకోవడంలోనే మన మనో నిగ్రహం తెలుస్తుంది.
నిరాశ, నిస్పృహా, భయం అనేవి చాలా ప్రమాదకారులు. మన మనస్సులో ఏ మాత్రం చోటు దొరికిన లోతుగా పాతుకుపోయి మనల్ని కష్టాలకు, బాధలకు గురిచేస్తాయి. ఎట్టిపరిస్థితిలో వాటిని మనుసులో రానియ్యకండి.ఆత్మవిశ్వాసంతో ముందుకేగండి.
ఆత్మవిశ్వాసం గల వ్యక్తి స్థిరమైన మనస్సుతో జీవనం సాగిస్తాడు. అత్యంత క్లిష్టపరిస్థితులను కూడా దైర్యంగా ఎదుర్కోవడానికి సంసిద్దుడై ఉంటాడు.
నమ్మకం, ఆత్మవిశ్వాసం, జీవితంలో ఆచరింపచేస్తే, జీవితం పండిన పూలతోట అవుతుంది.☝

👉🏼తప్పు చేసిన వారికీ ఒక అవకాశం ఇవ్వాలి తప్పులేదు కానీ, మోసం చేసినవారికి మాత్రం ఎప్పటికి మన జీవితంలో చోటివ్వకూడదు.
బంధాలు గొప్పవా... ?  బాధలు గొప్పవా... ? అంటే అవసరానికి వాడుకునే బంధాలకంటే... అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి నా దృష్టిలో...
ఆశలు అదుపులో ఉంటే రాతినేలమీద పడుకున్న కూడా హాయిగా నిద్దురవస్తుంది కానీ, కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా ముల్లులా గుచ్చుకుంటుంది.
మనకన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దైర్యంగా ఉండడం గొప్పకాదు. ఎన్ని సమస్యలు మనలను చుట్టుముట్టిన ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే గొప్ప.
మనం చచ్చాక శవముగా మారె మన శరీరం, ఎవరికి కనబడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసపు ముద్దా కాయంతో ప్రాణం పోయాక... ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోడానికి ఇష్టపడని బంధాలు దీనికోసమా... అబద్దాలు, మోసాలు  నీతి, నియమాలు వదిలేయడం. పగలు, ప్రతీకారాలతో సతతం మనుసు అగ్నిజ్వాలై రగిలేది.
మనిషి చుట్టు మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి కానీ, దేన్ని వదిలేయాలి, దేన్ని తీసుకోవాలి అనేదాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది.💥☝             🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

No comments:

Post a Comment