X7. X2. 1-9. 191022-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కర్మ _పునర్జన్మ
➖➖➖✍️
మనకి కష్టాల ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి.
1. మొదటిది:-
మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.
2. రెండవది:
వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.
3. మూడవది:-
ఈ శక్తులు మన వర్తమానంలోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.
ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు?
మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.
మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి.
విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని ‘మూడు జన్మల్లో హరి వైరులుగా మారి, శ్రీహరితో చంపబడి వైకుంఠం చేరతారా?’ లేదా ‘ఏడు జన్మల్లో హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా? ‘ అని అడిగితే వారు ‘ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము!’ అన్నారు.
మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ! దీనికి మనం ఏమి చేయాలి? దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు..
యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జీతాః
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితమ్ బుధాః
భగవద్గీత.. జ్ఞానయోగం..19 శ్లో.
ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు జ్ఞానం అనేయగ్ని చేత దహించబడతాయి.
"యధేయాంసి సమిద్ధో అగ్ని ర్భస్మాత్కురుతే అర్జున
జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కతరుతే తధా”
జ్ఞాన యోగం: 37 శ్లో.
"అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.”
ఈ ఉపదేశం లో పరమార్ధం ఏమిటి?
జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే… మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు.
మనం ఈ కర్మ రహస్యాన్ని… జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా!
కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు.
జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమయింది కదా.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment