💖💖 "351" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
"ధ్యాన ప్రక్రియను ఆశ్రయించిన వారందరికీ శాంతి ఎందుకు రావట్లేదు ?"
"ప్రపంచం విషయంలో కోరికలను విడిచిపెట్టకుండా శాంతిని పొందాలని ధ్యానంలో తపన పడటం అందుకు కారణం. వీరి దృష్టిలో ధ్యానం అంటే కోరికలను ఆపకుండా కేవలం తన ఆలోచనలను తాత్కాలికంగా ఆపే ప్రయత్నం. కానీ కోర్కెలను జయించటం ద్వారా నిజమైన, శాశ్వతమైన ధ్యానం కుదురుతుంది. ఒక వస్తువుపై ఇష్టం ఏర్పడి అది తనకు లభించలేదనే భావం వెలితిగా మారి కోరిక రూపంలో మనసుని బాధిస్తుంది. ఇలా భౌతిక విషయాలతో పాటు మనిషి తను శాంతి కోసం సృష్టించుకున్న ధ్యాన ప్రక్రియలు కూడా ఒక కోరికగా మారి వేధిస్తున్నాయి. తన నిజస్వరూపాన్ని, భగవంతుని తెలుసుకోవాలనే తీవ్రత ఉన్న వ్యక్తి సహజంగానే ప్రపంచాన్ని తన దేహాన్ని మరిచిపోయేంతగా సాధన చేస్తాడు. అతనికి ఈ ప్రపంచాన్ని మర్చిపోవడం ద్వారా అంటే భౌతిక విషయాలపై ఆశను విడనాడటం వలన శాంతి లభించింది. అంతేగాని అతను శాంతి కోసమే సాధన చేయటంలేదు !"
"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"
No comments:
Post a Comment