Xx2. i. 2-6. 201022-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఆలయలలో…
తీర్థం
ఎలా తీసుకోవాలి..?
➖➖➖✍️
ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు రాయొద్దు..?
తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!
గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు.
శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ శిలలకు… రుద్ర నమక చమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి (తులసీదళ సహితమై, పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును) ఇస్తారు.
శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు.
ఈ తీర్ధమును అర్చన పూర్తి అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికి, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.
తీర్ధమును ఎలా తీసుకోవాలి
అనే ప్రశ్నకు సమాదానం మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి.
తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.
తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం.
తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి.
అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.
1). మొదటిసారి తీర్థం శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది..
2). రెండోసారి తీర్థం న్యాయ ధర్మ
ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
3). మూడోది పవిత్రమైనపరమేశ్వరుని
పరమ పదం అనుకుంటూ
తీసుకోవాలి.
తీర్థాల రకాలు:-
1). జలతీర్ధం
2). కషాయ తీర్ధం
3). పంచామృత తీర్ధం
4). పానకా తీర్ధం
1. జల తీర్ధం:- ఈ తీర్ధం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు నివారించబడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .
2). కషాయ తీర్ధం:- ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు.
రాత్రి పూజ తరువాత తీర్థమును కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనికనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.
3). పంచామృత అభిషేక తీర్థం:- పంచామృత సేవనం ద్వారా…. చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
4). పానకా తీర్ధం:- శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.
పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది . రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇతరమైన రకాలు:- ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు.
వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.
సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం - పాటిద్దాం. మంచి విషయాన్ని పది మందికి పంచుదాం. మన సంస్కృతీ సాంప్రదాయాలను మన పిల్లలకు, భావితరాల వారికి చేరవేద్దాం.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment