*మిత్రమా...*
ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు జరపడంలో కూడా మంచి అంతరార్థం ఉన్నదట..💐
నవరాత్రి ఉత్సవాలు ఎందుకు జరపాలి!?
🍁దసరా అంటే దస్+హరా అని; అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని "దసరా వైభవం" గా దశమినాడు జరుపుతూ ఉంటారు.
🍁ఇక దేవీ నవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.
🍁ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.
🍁మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త 'దశమి' తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు "దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞులు.
🍁ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు జరపడంలో కూడా మంచి అంతరార్థం ఉన్నదట! శరదృతువుకు ముందు వర్షరుతువు ఉంటుంది. బహుళంగా కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి "యమదంష్ట్రము"లని పేరు. దేవి మహిషాదిజంతువులను జయించడంలో అంతరార్థమిదే అని దేవీభాగవతం చెప్తోంది. కావున ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు ఋతువులలోను నవరాత్రి ఉత్సవాలు జరుపవలెనని పేర్కొంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment