Sunday, October 16, 2022

ప్రతిరోజూ కొనసాగించే ఈ సాధనలు ఎప్పటికి పూర్తవుతాయని భావించాలి ?

 💖💖💖
       💖💖 *"560"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"ప్రతిరోజూ కొనసాగించే ఈ సాధనలు ఎప్పటికి పూర్తవుతాయని భావించాలి ?"*
**************************

*"అన్ని మార్గాలు ఆత్మసాధనతోనే ముగుస్తాయని శ్రీరమణమహర్షి అన్నారు. మన సాధనలో ప్రతి అంకం కేవలం సోపానాలు మాత్రమే. నామజపం, ధ్యానసాధన, దేవతార్చన ఇవన్నీ మనలోని నిరాకార దైవాన్ని తెలుసుకునే వరకు సాగాల్సిందే ! ఏ సాధనా మార్గమైనా సత్ప్రవర్తనతోనే ముడిపడి ఉంది. మనంచేసే అర్చన వల్ల మనం కోరుకున్నది వస్తుంది. మనం సత్శీలంతో ఉంటే దైవమే మన వద్దకు వస్తుంది. ఒకసారి ఒక రాజుగారు రాజ్యంలోని అందరికీ కోరుకున్నది ఇస్తానని ప్రకటించారు. తలా ఒక కోరిక కోరుకుని అందరూ రాజుగారి నుండి పొందారు. ఒక రైతు తన ఇంట్లో రాజుగారు ఒకరాత్రి గడపాలని కోరుకున్నాడు. అందరూ అతడిని వెర్రివాడనుకున్నారు. కానీ ఆ రాజుగారు ఒకరాత్రి బస చేయాలంటే అక్కడ ఎంతటి వైభోగం ఉండాలో అవన్నీ కొద్దిరోజుల్లోనే సమకూరాయి. రాజుగారి బస కోసం రైతు ఇల్లే ఒక రాజమహల్ గా మారింది. అలాగే మనం సత్శీలంతో దైవాన్ని రప్పించుకున్న తర్వాత మనం ఇక ఏ కోరిక కోరుకునేందుకు అవకాశం లేనంత ఐశ్వర్యవంతులం అవుతాం. వరలక్ష్మీ వ్రతకథలో చారుమతి అనే ఇల్లాలికి అసలు వరలక్ష్మి ఉన్నట్లే తెలియదు. తన ధర్మవర్తనం చేత ఆ దేవతే కలలో కనిపించి తన వ్రతం చేయమని చెప్పింది !"*

*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
           

No comments:

Post a Comment