ఓం నమః శివాయ:
🧘♀️నవదుర్గలు /షట్చక్రాలు / శ్రీ చక్రం -మానవశరీరం🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
అవ్యక్తము నుంచి వ్యక్తమయిన స్థితినే అమ్మవారు లేక మూలప్రకృతి అంటారు.
ఆధ్యాత్మికత స్థితులు/చక్రాలు
🕉🌞🌏🌙🌟🚩
ఆధ్యాత్మికత =ఇచ్ఛాశక్తి +జ్ఞానశక్తి +క్రియాశక్తి = పార్వతి + సరస్వతి + లక్ష్మీ= ధ్యానం + జ్ఞానం + సేవ = Starting + Middle + Ending stage.
నవ రాత్రులనగా:--
@@@@@@@@@
1) ☸️మూలాధారచక్రం - (శైలపుత్రీ)- Body consciousness / మొదటి రోజు పృధ్వీ🌎తత్త్వము:- అనగా అన్నమయ శరీరమునకు సంబంధించినది.
2)☸️స్వాధిష్టానచక్రం - (బ్రహ్మచారిణీ) - Family consciousness / రెండవ రోజు జల 💦తత్త్వము:- ప్రాణమయ శరీరమునకు సంబంధించినది. రెండవ రోజు పూజ కోరికలు ధర్మయుక్తము అవడానికి.
3)☸️మణిపూరకచక్రం - (చంద్రఘంట) Society consciousness / మూడవ రోజు అగ్ని 🔥తత్త్వము:- మనోమయ కోశమునకు సంబంధించినది. మనలో భావాలు అగ్నితో పునీతమవుతాయి. అక్కరలేని భావాలు ఉండవు.
4)☸️అనాహతచక్రం - (కూష్మాండ) Empty consciousness / నాల్గవ రోజు వాయు 🌬తత్త్వము:- దైవీ పరమైన భావాలు కలుగుతాయి. పంచభూతముల యందు స్వామిత్వము వస్తుంది. అంతర్లోకాలకి తీసుకొని వెడుతుంది.
5)☸️విశుద్ధచక్రం - (స్కందమాత) Balanced consciousness / అయిదవ రోజు ఆకాశ🎇తత్త్వము. మన హృదయము లోపల ఆకాశము దర్శనమిస్తుంది. అమ్మవారిని 'దహరాకాశరూపిణి' అంటాము గదా!
6)☸️ఆజ్ఞా చక్రం - (కాత్యాయనీ)Third eye consciousness / ఆరవ రోజు మనసు మీద గూడా స్వామిత్వము వస్తుంది. మనసు మృదువుగా తయారయితే సప్తమి రోజు పూజ అనుభూతి నిస్తుంది.
7)☸️సహస్రార చక్రం - (కాలరాత్రీ) Sharing knowledge to Universe consciousness. ఏడవ రోజు మనసును దాటి బుద్ధి లోకాలలోకి ప్రవేశం జరుగుతుంది. అపుడు మూలా నక్షత్రము రోజు పూజ చేసుకోవాలి.
8) ☸ ఊర్ధ్వ సహస్రారచక్రము -(మహాగౌరీ) (బ్రహ్మరంధ్రము)All type of knowledge to Universe consciousness.- ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పూజ. అనగా అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. మహిషాసురుడు అంటే అహం కారంతో కూడిన స్వభావము.
9)☸బిందు చక్రం - (సిద్ధిదాత్రీ)All type of knowledge to Universe consciousness.- అహంకారం తగ్గిపోతే అమ్మవారి మహత్యం తొమ్మిదవ రోజు తెలుస్తుంది. తొమ్మిది, పది రోజులు పరమాత్మ దివ్య చైతన్యంతో కూడి ఉంటుంది. అదే మహర్నవమి. విజయదశమి.
10)నిర్వాణచక్రం - (మహిషాసురమర్ధిని /దుర్గాదేవి /రాజరాజేశ్వరీ దేవి ) All type of knowledge to Complete Universe consciousness / ☸️Every consciousness is need for our Life.
🕉🌞🌎🌙🌟🚩
మానవుడు చేసిన కర్మలనునసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది, సాధకుని యొక్క సాధనను బట్టి అన్నిరకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ ముక్తి 5 రకాలు గా వర్ణించ బడింది.
1.మణిపూరంలో దేవిని అర్చించే వారికి “సార్షిరూపముక్తి”.(మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.)
2.అనాహతంలో దేవిని అర్చించేవారికి “సాలోక్యముక్తి”(అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు.దీన్ని సాలోక్యముక్తి అంటారు.)
3.విశుద్ధిచక్రంలో దేవిని అర్చించే వారికి 'సామీప్యముక్తి” (విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు. ఇది సామీప్యముక్తి.)
4.ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి “సారూప్యముక్తి”(ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైనరూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.)
5.సహస్రారంలో దేవిని అర్చించే వారికి “సాయుజ్యము”(సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ.ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.లభిస్తాయి.)
@@@@@@@@@@
శరన్నవరాత్రులు - శ్రీ త్రిపురసుందరి
@@@@@@@@@@
దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షస శక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’.
నవరాత్రుల పూజ తరవాత దశమితో పండగలు ముగుస్తాయి. ‘నవ’ సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. తొమ్మిది పూర్ణ శక్తి. నక్షత్రాలలో మొదటిదైన ‘అశ్వని’ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ‘ఆశ్వయుజం’. ఒక విధంగా – నక్షత్రగణనతో ఇది సంవత్సరానికి మొదటి మాసం. ఈ తొమ్మదిరోజులు విశ్వ చైతన్య శక్తిని (పరాశక్తని – ఆదిశక్తిని) ఆరాధించేవారు పూర్ణంగా సంవత్సరారాధన ఫలాన్ని పొందుతారు. యోగపరంగా అంతర్ముఖావలోకనమే రాత్రి. ఆ సాధనలో విశ్వమంతటా వ్యాపించిన అఖండ శక్తిని గమనించ గలుగుతాం.
No comments:
Post a Comment