Friday, October 14, 2022

ఆలోచనలు, అశాంతి, కోరికల మధ్య సమన్వయం ఉంటే శాంతి వస్తుందా ?

 💖💖💖
       💖💖 ** 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"ఆలోచనలు, అశాంతి, కోరికల మధ్య సమన్వయం ఉంటే శాంతి వస్తుందా ?"*
***************************

*"వెలుతురు లేకుంటే ఉన్నది చీకటే అన్నట్లు, ఆలోచనలు లేకపోతే ఉన్నస్థితి శాంతే. నిజానికి శాంతి ఎప్పుడూ మనలో కొనసాగుతూనే ఉంది. క్రొత్తగా వచ్చి చేరేవి ఆలోచనలే. అనవసర ఆలోచనలే శాంతిని కప్పివేస్తున్నాయి. ఈ అనవసరమైన ఆలోచనలకు కారణం కోరికలే. నిజంగా శాంతి కావాలంటే కోరికలను తగ్గించుకోవాలి. అలా కాకుండా కోరికలను తీర్చుకొనేందుకు వెంపర్లాడుతూనే ఆలోచనలను ఆపాలనుకోవటం అత్యాశే అవుతుంది. ఇదంతా ఏదోక విధానంలో మాత్రమే ధ్యానాన్ని సాధించుకోగలం అనుకునే వారి తపన. కానీ ఒక సామాన్యుడికి ధ్యానం అవసరం కంటే జీవితంలో శాంతి అవసరం చాలా ఉంది. అలాంటి శాంతిని సాధించటం కోసం మహాత్ములు జ్ఞానాన్ని బోధించారు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
        

No comments:

Post a Comment