Wednesday, October 5, 2022

అమ్మలో సృష్టికారకత్వమైన బ్రహ్మతత్త్వమే కాదు, స్థితి కారకత్త్వమైన విష్ణుతత్త్వం కూడా ఉంటుంది.

 అమ్మలో సృష్టికారకత్వమైన బ్రహ్మతత్త్వమే కాదు,              స్థితి కారకత్త్వమైన విష్ణుతత్త్వం కూడా ఉంటుంది.

రక్షకత్వం అమ్మ నర-నరానా జీర్ణించుకుని ఉంటుంది.            ఇది చంటితనంలో పాలివ్వడంలోనే కాదు 
బిడ్డకు ఎన్నేళ్ళ వయసొచ్చినా  పుట్టిన కొడుకు కృతఘ్నుడే అయినా 
వాడు నూరేళ్ళు బతకాలని అమ్మ కోరుకుంటుంది //

నోములు   వ్రతాలు  పూజలు  ప్రార్థనలు 
అన్నీ  బిడ్డ క్షేమం కోరే చేస్తుంది !
ఆమెకు ఎంత వయసొచ్చినా  ఇది అమ్మ లక్షణం  అమ్మ స్థితికారకత్వం //

శరీరం విడిచిపెట్టిన తరువాత 
అంత్యేష్ఠి సంస్కారం మంత్రవైభవంతో చెప్తారు

జీవుడు శరీరాన్ని వదలి వెళ్ళే దశల్లో 
చివరన వ్యానవాయువనేది జీవుడిని 
శరీరాన్ని పట్టుకుని ఉంటుంది
అలా పట్టుకుని ఉన్నప్పుడు –  కన్నబిడ్డలనే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది

అందుకే జ్ఞాతులు 11 రోజులు మైలపడతారు
వారి సంక్షేమంకోసం కొడుకు  11వ రోజున  శ్మశానంలోనే ఆనంద హోమం చేస్తాడు //

ఆ సమయంలో కొడుకు వెళ్ళి 
శవరూపంలో ఉన్న అమ్మతో ఒకమాట చెప్తాడు //

పిచ్చితల్లీ !
శరీరం జర్జరీ భూతమయిపోయింది !
ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటావు 
మా మీద వ్యామోహం ! అమ్మా  !!
మేం సంతోషంగా ఉన్నాం  వదిలిపెట్టేయ్‌ శరీరాన్ని ! వెళ్ళిపో ! పోయి మంచి శరీరాన్ని పొంది !
రా  మళ్ళీ   లోకంలో పుణ్యకర్మలు చేసుకో  వదిలిపెట్టెయ్‌ > అని కొడుకు చెప్పిన 
మంత్రానికి వదిలేస్తుంది శరీరాన్ని
> అప్పటివరకు వదలదు //

శిథిలమయిపోయిన భవనం మీద 
తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్లు 
జీవుడు { తండ్రికానీ  తల్లికానీ }
శరీరాన్ని పట్టుకుని ఉంటాడు
కొడుకు చెప్పిన మంత్రంతో వదిలేస్తాడు !
> అదీ వాళ్ళిద్దరి అనుబంధం //

అమ్మ కడుపులో 
నుంచి బయటికి రావడంతో  
నాభీబంధం (బొడ్డు) తెగిపోవచ్చు
కానీ  హృదయ సంబంధం మాత్రం తెగదు !!
కొడుకు ధార్మికుడైతే ఆ .. హృదయసంబంధం
ఉన్నందుకు  ఎక్కడ ఉన్న 
పితృదేవతలనైనా ఉద్ధరించగలడు //

ఇక్కడ గయా శ్రాద్ధం పెట్టి 
ఎవరినైనా ఉద్ధరించగలడు !
అటువంటి కొడుకు పుట్టాలని 
తల్లిదండ్రులు కోరుకుంటారు //

 కాబట్టి అమ్మ అంటే రక్షకత్వం.
శిశువు జన్మించిన నాటినుండి నాలుగు లేదా 
ఆరు నెలల వరకూ శిశువు శరీరానికి కావలసిన  సమస్త పోషకవిలువలున్న పాలు పరమ 
పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తయరయ్యేది,
ఒక్క అమ్మలోనే  అని డాక్టర్లు చెబుతుంటారు //

నేను చెబుతున్నది 
కేవలం  సనాతన ధర్మశాస్త్రాలలోది కాదు

సనాతనం కేవలం 
మాతృదేవోభవ అన్నది
పుస్తకాల్లో డాక్టర్లు రాసిన మాట 
మీతో మనవి చేసుకుంటున్నా //

అమ్మ అన్నం తిన్నందుకు 
అమ్మలో పాలు ఊరవు  బిడ్డ చప్పరిస్తే 
వాడి ఆకలి తీరలేదన్న భావనచేత ఊరతాయట !
వాడి కడుపు నిండుతుంటే అమ్మకు 
ఆరోగ్యం కలుగుతుందని రాశారు //
అంత గొప్ప స్వరూపం అమ్మలో 
నిక్షిప్తమై ఉంటుంది  కాబట్టే అమ్మ విష్ణువు ///

అమ్మను మించిన 
రక్షకుడు లోకంలో ఉండరు
అందువల్ల మా అమ్మగారా !
నా వద్దే ఉంటున్నారండీ  అనకు 
> అది చాలా తప్పు మాట !!
నా అదృష్టమండీ, నాకిన్నేళ్ళు వచ్చినా 
> అమ్మ చేతి అన్నం తింటున్నాను //
అని అనాలి  అంతే తప్ప 
అమ్మకు నేను అన్నం పెడుతున్నాననడం 
కృతఘ్నత అవుతుంది //

సృష్టికారకుడైన బ్రహ్మ 
స్థితికారకుడైన విష్ణువులే కాదు
లయ కారకుడైన రుద్రుడి అంశ కూడా 
అమ్మలో ఉంది ఆమెలో ఉన్నది శివశక్తి‌ //

చాలా మంది రుద్రుడు అనగానే 
ఆయన చంపేస్తాడనుకుంటారు 
అలా అర్థం చేసుకోకూడదు
అలా అయితే శివార్చనలు 
ఎందుకుంటాయి లోకంలో ?
> అలా ఉండదు //

లయ కారకుడైన రుద్రుడు 
మూడు రకాలైన ప్రళయాలు చేస్తాడు
ఒకటి  నిత్య ప్రళయం
రోజూ చేసేది నిత్య ప్రళయం /
మనకు పరమేశ్వరుడు జ్ఞానేంద్రియాలను  కర్మేంద్రియాలను ఇచ్చాడు //
వీటిని విచ్చలవిడిగా వాడేసారనుకోండి
అవి అలసిపోతాయి  వాటికి మళ్ళీ శక్తి కావాలి మనం పడుకున్నప్పుడు రుద్రుడు 
మనకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి 
మనం ఆ సుఖం అనుభవిస్తుండగా  ఇంద్రియాలన్నింటికీ పటుత్వమిస్తాడు
అంటే అవి కోల్పోయిన శక్తిని  మళ్ళీ ఇస్తాడు
దీనిని నిత్య ప్రళయమంటారు //

రెండవది  ఆత్యంతిక ప్రళయం 
అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిస్తాడు

మూడవది – మహా ప్రళయం
అంటే  జీవుడు తనను పొందలేకపోతే 
యుగాంతంలో తానే  జీవుడిని పొందేస్తాడు
మైనపు ముద్ద నల్లపూసల మీద పడ్డట్లు 
తనని పొందలేకపోయిన జీవులను 
మహా ప్రళయంతో పరమాత్మ తానే పొందేస్తాడు
ఇవి మూడూ చేస్తాడు  అందుకే 
ఆయన శివుడయ్యాడు //

అమ్మలో  శివాంశ ఉంటుంది
> ఎలా అంటే !
అమ్మ చేసే చాలా గొప్ప పని నిద్రపుచ్చడం  అమ్మదగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా 
మరెక్కడా పడుకోరు
పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా 
అమ్మ ఒక్కసారెత్తుకుని 
ఇలా జోకొడితే చాలు 
అమ్మ స్పర్శతగలగానే  నిద్రలోకి జారుకుంటారు‌ //

అమ్మ నోటిమాటవింటే చాలు  నిద్రపోతారు //

అమ్మ నిద్రాకాలిక  సుఖాన్నిస్తుంది //

అమ్మ ఒడిలో నిద్రపోవాలన్న కోరికకు 
కృష్ణ పరమాత్మ అంతటివాడు పరవశించిపోయాడు
అమ్మంటే తెలియని పరమాత్మ
అమ్మ ఒడిచేరేటప్పటికి నిద్రపోయాడు
ఇక మనమెంతటి వాళ్ళం //

అమ్మ ఒడికి సమానమైనది లేదు " అది శివపర్యంకం,
అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంది,

నిత్య ప్రళయం చేస్తుంది ఇది అమ్మలోని రుద్రాంశ‌

ఓ శ్రీ శక్తిస్వరూపిణియై నమః 🙏

No comments:

Post a Comment