Thursday, October 20, 2022

నేడు మీరు కోరేవి చాలా గొప్పవే కోరుతున్నారు గాని ఆచరణ మాత్రం దానికి తగినట్లుగా ఉండటం లేదు.

 🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️*🌺*

*_🌴" నేడు మీరు కోరేవి చాలా గొప్పవే కోరుతున్నారు గాని ఆచరణ మాత్రం దానికి తగినట్లుగా ఉండటం లేదు. ఆడవారు, “నాకు రాములవంటి భర్త కావాల”ని అంటారు. ఆమె సీతమ్మ మాదిరిగా ఉంటేకదా రాముని వంటి భర్త రావటానికి. ఈమె లంఖిణి మాదిరి ఉంటే రామునివంటి భర్త ఎట్లా వస్తాడు?! ఇక మగవారు చూస్తామా అంటే"నాకు సీత లాంటి భార్య కావాలి” అని ఆశిస్తారు. ఇతను రావణాసురుని మాదిరి ఉంటే సీత ఎట్లా చిక్కుతుంది? ఇతను రాములవంటివాడుగా ఉండాలి కదా! దేవుని పూజించడానికి, భజించడానికి  కూర్చుంటారు కానీ మనసులో ఏవేవో అలోచనలు చేస్తుంటారు. వీటి వలన ఏమైనా ప్రయోజనం ఉందా!?  మీరు ఏది కోరతారో దానికి తగినవారుగా తయారైనప్పుడే ఆ కోరిక ఫలిస్తుంది. “ కొనేది వంకాయలు, కొసరడిగేది గుమ్మడికాయలు!” ఈ రకంగా పోతే మీరు ఏరీతిగా ధన్యులవుతారు?!🌴_*

No comments:

Post a Comment