Wednesday, October 5, 2022

"దసరా" అంటే?

"దసరా" అంటే?

దసరా దశహరా నుండి రూపాంతరం చెందింది.
దశ అనగా పది.
పది తలలు గల రావణుడిని హరించిన రోజే దశహరా.!
ఇది భౌతికమైన విషయం.
ఆద్యాత్మికంగా ఆలోచించినట్లైతే?
మనిషిలోని పది దుర్గుణాలను లేదా పాపాలను హరించవలసిన రోజు.!
అదే నిజమైన దసరా.!
ఏమిటా దుర్గుణాలు?
అవి
శారీరకంగా చేసే పాపాలు 3.
1.అపాత్రదానం.(చేయవలసిన వారికి దానం చేయకపోవడం లేదా మనం చేసిన దానం వృధా కావడం)
2.శాస్త్రం అంగీకరించని హింస చేయడం.
3.పర స్త్రీ ని లేదా పురుషుని పొందు కోరడం.,సంగమించడం.
నోటి ద్వారా చేసే పాపాలు 4.
1.పరుషంగా మాట్లాడుట.
2.అసత్యాలు చెప్పడం.
3.వ్యర్థ ప్రలాపాలు చేయడం.
4.అసభ్యంగా మాట్లాడుట.
మనసు ద్వారా చేసే పాపాలు 3.
1.పరుర సొమ్ము ను దొంగిలించాలనే బుద్ధి ఉండటం.
2.ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం.
3.అహంకారం కల్గి ఉండటం.
ఇవి పది పాపాలు!
ఈ పాపాలను హరించుకుందామనీ.,ఆ హరించే శక్తి అమ్మ దుర్గామాత మనందరికీ ఇవ్వాలని ఆశిద్దాం.
జై దుర్గామాతా.

సేకరణ

No comments:

Post a Comment