Wednesday, October 5, 2022

మహాకవి కాళిదాసు రచించిన 'శ్యామలా దండకం' పారాయణ చేస్తూ అంబికను పూజిస్తే, విద్యలు, విజ్ఞానం లభిస్తాయని పండితులు చెప్తున్నారు.

 300922a1905.   011022-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀650.
నేటి…

              ఆచార్య సద్బోధన:
                  ➖➖➖✍️

పిల్లలు చదువులలో శ్రద్ధ లేక వెనుకబడిపోయారని దిగులుపడవద్దు..!

మహాకవి కాళిదాసు  రచించిన 'శ్యామలా దండకం' పారాయణ చేస్తూ అంబికను పూజిస్తే, విద్యలు, విజ్ఞానం లభిస్తాయని  పండితులు చెప్తున్నారు.

పామరుడు, నిరక్షరకుక్షియైన ఒక సాధారణ వ్యక్తిని కాళికామాత అనుగ్రహించి సకల విద్యలలో, కళలలో పారంగతుడిని చేసింది.

మహాకవి కాళిదాసుగా లోకప్రసిద్ధం చేసింది. జగదేకమాత అంబిక కరుణకటాక్షాలను కీర్తిస్తూ చేసిన స్తోత్రమే శ్యామలా దండకం.

మతంగ మహాముని తపః ఫలమైన పుత్రిక  అంబిక  రాజమాతంగి అయిన శ్యామలాదేవిని స్తుతిస్తూ చేసిన స్తోత్రం..

”మాణిక్యవీణాం ముపలాలయంతీం".. అని ఆరంభమయే ఆ స్తోత్రాలను మంచి గురువుల వద్ద, అర్ధం తెలుసుకుని భక్తి శ్రద్ధలతో పఠిస్తే  తప్పకుండా జగజ్జనని అనుగ్రహం లభిస్తుంది.

శ్యామలాదేవిని భక్తితో పూజించడం వలన సకల కళలలోను ప్రావీణ్యత కలిగి, సకల సౌభాగ్యాలు లభిస్తాయి.

రాజభోగాలు కోరేవారు- అమ్మవారిని బిల్వ దళాలతోను, తామర పుష్పాలతోను పూజించాలి.

మందార పుష్పాలతో దేవిని అర్చిస్తే  శ్యామలాదేవి ఉన్నత పదవులు  అనుగ్రహిస్తుంది.

నీలోత్పలాలతో పూజిస్తే సకల దోషాలు నివృత్తి అవుతాయి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment