Friday, October 21, 2022

భగవద్గీత ఒక్క ముక్కలో! - Sridhar Nallamothu

 భగవద్గీత ఒక్క ముక్కలో! - Sridhar Nallamothu

చాలామంది "కర్మ" అంటే అదేదో చెడ్డ పదం అని భావిస్తుంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఓ విషయం ఇక్కడ మొదట ప్రస్తావించాలి. కర్మలు చెయ్యడం త్యజించరాదు. అలా ఏ కర్మా చెయ్యకుండా ఉండడాన్ని తమోగుణ త్యాగమంటారు. కర్మలు చేస్తూనే ఉండాలి, వాటి నుండి విముక్తం అవుతూనే ఉండాలి.

దాన్ని సృష్టిలోని ఎనర్జీ ఫార్మేట్‌లో అన్వయించి చెబుతాను. ఏకత్వంతో ఉన్న సృష్టి తనని తాను అభివ్యక్తీకరించుకోవడానికి పాజిటివ్, నెగిటివ్ అనే రెండుగా విభజించుకున్నప్పుడు.. ఆ విభజన ప్రతీ అంశంలో జరిగినప్పుడు ఆ రెండు ఫోర్సెస్ మధ్య నియంత్రణ కోసం మధ్యలో ఉన్న న్యూట్రల్ ఫోర్స్ అమల్లోకి వచ్చింది. ఈ మూడు కలిసి సృష్టినీ, సృష్టిలోని లైఫ్ ఫోర్స్‌నీ రకరకాల వైబ్రేషన్స్, మూమెంటమ్‌తో నడిపిస్తూ ఉంటాయి. 

ఇప్పుడు ఎవరైనా వ్యక్తి నేను అంతా మంచే చూస్తాను.. నాకు అంతా మంచి అనుభవాలే కావాలి అని కేవలం పాజిటివ్‌నే ఎక్స్‌పీరియెన్స్ చెయ్యాలి అని కూర్చున్నాడు అనుకోండి. అది అజ్ఞానం. మరో వ్యక్తి సృష్టిలో అంతా నెగిటివే ఉంది, ఇక్కడ అంతా వేస్ట్ అని పూర్తి నెగిటివ్‌గా ఆలోచించేలోపే అతని కాన్షియస్ మైండ్‌కి తెలీకపోయినా ఏదో ఒక పాజిటివ్ అతని అనుభవంలోకి వస్తుంది. లేదా ఏదో ఒక పాజిటివ్ కర్మ చేస్తాడు.

అమ్మా, నాన్నా అనే పాజిటివ్ నెగిటివ్, కొడుకు అనే ఆ పాజిటివ్ నెగిటివ్ నుండి ఏర్పడిన మేటర్ అనే న్యూట్రల్ ఎనర్జీ ఈ ముగ్గురు సమీకరణాన్నే తీసుకుందాం. అమ్మా నాన్నకి కొడుకు పుట్టాక ఆ రెండు పాజిటివ్, నెగిటివ్ ఫోర్సెన్ నుండి కొడుకు అనే ఓ న్యూట్రల్ ఎనర్జీతో ఓ ట్రయాంగిల్ పూర్తవుతుంది. అది పదార్థం యొక్క form. అంటే మానవ శరీరం. అది అయిపోయాక కొడుకు జీవితాంతం అమ్మా నాన్నని పూర్తి మంచిగా చూసుకోలేడు.. పూర్తి చెడుగా చూసుకోలేడు.. ఏది మంచి ఏది చెడు అనే వేల్యూస్ కూడా అమ్మకీ, నాన్నకీ, కొడుకుకూ మారుతుంటాయి. బజారుకి వెళ్లిన వాడు కూరగాయలు తీసుకు రమ్మంటే తీసుకు రాలేదు, అమ్మ చెప్పేది ఏదీ వినడు అని అమ్మని అనిపిస్తే అది అమ్మ perceptiveలో నెగిటివ్ కర్మ క్రింద లెక్క.  కానీ బజారుకి వెళ్లి ఫ్రెండ్ అవసరంలో ఉంటే సాయం చేసి వచ్చాను అనేది ఆ కొడుకు దృక్కోణంలో పాజిటివ్ కర్మ.

ఇప్పుడు అమ్మ కొడుకుని తిడుతుంది. అది ఆమె చేసే మ్యాప్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో తక్కువ వైబ్రేషన్ ఉన్న కోపం అనే ఓ నెగిటివ్ కర్మ. దానికి ఆ కొడుకు ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. అతను పైకి వ్యక్తం చెయ్యకపోయినా అని శాక్రల్ చక్రలో ఎనర్జీ బ్లాక్ అయి అదే మ్యాప్ ఆఫ్ కాన్షియస్ నెస్‌లో అతనిలోనూ మానసికంగా ఓ నెగిటివ్ కర్మ ఏర్పడుతుంది.

 ఇలా పాజిటివ్ నెగిటివ్ కర్మలు మనుషుల అంతర్గత ప్రపంచాలను బట్టి విడదీయలేనంతగా, అర్థం చేసుకోలేనంతగా గందరగోళంగా పెనవేసుకుపోయి, ఒక మనిషి జీవిత కాలంలో రకరకాల విషయాల్లో కోటానుకోట్ల కర్మలుగా మారిపోయి.. ఆ కొడుకు అన్ని కర్మలూ చేస్తూనే దేంట్లో ఇరుక్కుపోకుండా అన్నింటినీ జస్ట్ విట్నెస్ చేసే మానసిక స్థితికి ఎప్పుడు చేరుకుంటాడో  అప్పుడు అతని జీవితంలో ట్రయాంగిల్ పూర్తవుతుంది. అంటే తన కళ్లకి కనిపించే, ప్రపంచంలో జరిగే ప్రతీ  నెగిటివ్, పాజిటివ్ ఫోర్సెస్ నుండి అన్నింటినీ సమ దృష్టితో చూసే స్థితికి చేరుకుంటాడు. 

ఆ స్థితికి చేరుకోవాలంటే ముందు అన్ని డైమెన్షన్స్‌లో పాజిటివ్ కర్మలూ చేయాలి, తెలిసో తెలియకో నెగిటివ్ కర్మలూ చేయాలి. శారీరక రూపంలో వ్యక్తీకరించబడిన సోల్ అనేది అటు శరీరంగానూ, ఇటు మైండ్ గానూ కాకుండా.. విశ్వం యొక్క ఇంటెలిజెన్స్‌కి చేరుకోవడమే చివరి మజిలీ. జీవితంలో అడుగడుగునా కనిపించే పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్‌.. చివరకు న్యూట్రల్ స్థితికి చేరుకోవడం ఏదీ లేకుండా శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మలు చెయ్యకుండా, వాటి నుండి డిటాచ్ అవకుండా ఉందామంటే సాధ్యపడే పనే కాదు. అలాగే పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్‌ని, లైఫ్ ఎక్స్‌పీరియెన్సెస్‌నీ పొందాక వాటి నుండి విముక్తం చేసే న్యూట్రల్ స్థితికి చేరుకోని వ్యక్తులకు.. మళ్లీ జీవితాన్ని నేర్చుకుని రా అని అవే పాజిటివ్, నెగిటివ్ కర్మలు చేసే పరిస్థితులు ఏర్పడడమే మనం తప్పుగా భావించే కర్మ. నువ్వు న్యూట్రల్ స్థితికి చేరుకోగలిగితే కర్మలు రిపీట్ అవవు.

- Sridhar Nallamothu

No comments:

Post a Comment