దివ్య జీవనం
పూర్వ అనుభవాల సారంతో మనం భవిష్యత్తుకు బాటలు వేసుకుంటాం. ఇందువల్ల మన జీవన విధాతలం మనమే అనుకోవడం కద్దు. అది మితిమీరితే మాత్రం ప్రారబ్ధం కొనితెచ్చుకున్నట్లే.
జీవనగతిని అధోగతికి చేర్చగల అహంకారాన్ని అదుపుచేసి జరిగేదంతా దైవలీలగా భావించాలి. అప్పుడు భవబంధ విముక్తితోపాటు ముక్తికి దారితీసే భక్తి బలపడుతుంది. వ్యక్తిత్వ వికాసానికి నైతిక విధానం కనుక తోడైతే రాగద్వేషాలకు అతీత మైన సమస్థితి చేకూరు తుంది. అలాంటి వ్యక్తిత్వం సమాజానికి దారిదీపం అవుతుంది.
'ఆత్మ ఒకటే ఆకృతులు వేరు' అన్న సత్యాన్ని నమ్మి ఆచరిస్తే మరింత ఉన్నత స్థితిని పొంద డానికి రంగం సిద్ధమవు తుంది. సంఘజీవిగా సామాజిక జీవన గతిని, స్థితిని బాగుపరిచే విధానమే ప్రధానం అనుకున్నప్పుడు మనిషే దేవుడు. అలాంటి సమాజం స్వర్గం. 'విధి బలీయం అని అందమైన జీవితాన్ని గాలికి వదిలేస్తారో, ఎరుకతో సన్మార్గాన్ని ఏర్పరచుకుని విశ్వచైతన్యం దిశగా అడుగులేస్తారో ఎవరిష్టం వారిది'- అంటాడు పాశ్చాత్య మేధావి హవాకసత్. ఆ దివ్యజీవనాన్ని ఆశిద్దాం.
ఓం నమః శివాయ
No comments:
Post a Comment