Wednesday, March 8, 2023

ఇష్టంగానే చేయాలి...

 ఇష్టంగానే చేయాలి...

జీవితం క్షణికమైంది, పరుల కోసం జీవించడంలోనే పరమార్థముంది. స్వార్థరాహిత్యం, కీర్తికాంక్ష లేని దానం, పరోపకారం మనం అలవరచు కోవాల్సిన సద్గుణాలు.

అవి నేర్చుకున్నప్పుడు వస్తుప్రేమ, కూడబెట్టడం ఉండవు. ఏ ప్రలోభాలూ తలెత్తవు. స్వార్థాన్ని అవినీతిగా భావిస్తారు. ఇవ్వడంతోనే ఆనందం ఉందని నమ్ముతారు. తేనెటీగలెంతో శ్రమించి సేకరించిన తేనె మరెవరికో దక్కడం తెలిసిందే. మనమైనా అంతే. సంపదలను సద్వినియోగం చేయకుండా లోభత్వం చూపితే కాలమనే ఎలుగుబంటి లాక్కుంటుంది. కనుక దానధర్మాలు ఇష్టపూర్వకంగానే చేయాలి. బలవంతంగా చేసేవాటికి ఫలితం శూన్యం. స్వార్థాన్ని విడిచిన వ్యక్తే నిజమైన ఆధ్యాత్మికవేత్త. నూరు భక్తి బోధల కంటే ఒకరికి అన్నం పెట్టడం మంచిది, తీర్థ యాత్రలు చేయడం కంటే దీనుల సేవలో తరించడం ఉత్తమం అన్నారు. ప్రేమ తత్వాన్ని వ్యాప్తి చేయడమే అసలైన జీవితమని బుద్ధుడు, ఆదిశంకరులు, తిరువళ్లువర్‌, పోతులూరి వీరబ్రహ్మం లాంటివారు హితవు చెప్పారు. ఆ పాఠాలను అర్థం చేసుకుని, ఆచరిస్తూ ధన్యులమవడమే మన కర్తవ్యం.

ఓం నమః శివాయ

No comments:

Post a Comment