🙏పురాణంలోని స్త్రీ మూర్తుల ప్రేమలు త్యాగాలు 🙏🙏🌹🌹🌹
1. గణపతి తల్లి ఎవరు
జ. పార్వతీదేవి
2. ఆకులు కూడా ఆహారంగా తీసుకోకుండా తపస్సు చేసింది కనుక పార్వతీదేవికి ఈ పేరు వచ్చింది.
జ. అపర్ణ
3. శక్తి స్వరూపిణి
జ. దుర్గ ,పార్వతి.
4. సకల మానవాళికి జ్ఞాన, విద్యా ప్రదాయిని.
జ. సరస్వతీదేవి.
5.సకల మానవాళికి ఐశ్వర్య ప్రదాయిని
జ. శ్రీ మహాలక్ష్మి
6. త్రిపధగామిని అని పేరొందినది ఎవరు?
జ.గంగా మాత.
7. వేదమాతగా చెప్పబడే దేవత ఎవరు
జ. గాయత్రీ దేవి
8. వేద కాలంలో పేరుపొందిన మహిళా వేదవేత్తలు ఎవరు?
జ. మైత్రి, గార్గేయి.
9. శంకరాచార్యుల వారితో వాదించిన స్త్రీ
జ. ఉభయ భారతి
10.జనకుని సభలో యాజ్ఞవల్క్యమహర్షితో చర్చకు దిగిన స్త్రీ మూర్తి ఎవరు?
జ. గార్గి
11. యాజ్ఞసేని అని ఎవరికి పేరు?
జ.ద్రౌపది
12. మిథిలా నగరపు రాజకుమారి ఎవరు?
జ. మైథిలి. (సీత)
13. శ్రీరామచంద్రుని సోదరి ఎవరు?
జ. శాంత
14. దశరధుని భార్యలు ఎవరు?
జ. కౌసల్య,సుమిత్ర, కైకేయి.
15. శ్రీరామచంద్రుడు రావణాసురాది రాక్షసులను సంహరించడానికి మార్గం సుగమం చేసినది ఎవరు?
జ. కైక
16. రామాయణం రచించిన రచయిత్రి ఎవరు?
జ. మొల్లమాంబ.
17.తన భర్తను ఎప్పుడు ఎడబాయకుండా సప్తఋషి మండలం లో సైతం భర్తని అంటిపెట్టుకుని ఉన్న మహిళ.
జ. అరుంధతి
18. అగస్త్యుని భార్య
జ. లోపాముద్ర
19.వివస్త్రగా వడ్డిస్తేనే ఆహారం స్వీకరిస్తామన్న త్రిమూర్తులను పసిపాపలుగా మార్చిన స్త్రీ మూర్తి.
జ. సతీ అనసూయ
20. తన భర్తను మరణం నుండి కాపాడుకోవడానికి సూర్య గమనాన్ని ఆపిన స్త్రీ మూర్తి
జ.సతీసుమతి
21. కుమారుని ద్వారా జ్ఞానబోధ పొంది ముక్తిని పొందిన స్త్రీ.
జ. కపిలుని తల్లి దేవహూతి.
22. తన తోటి కోడలుకు సంతానం కలిగిందని తెలుసుకొని తన గర్భాన్ని వ్రయ్యలు చేసుకున్న స్త్రీ.
జ.గాంధారి.
23. పుత్రశోకంతో ఉండి కూడా తన పుత్రులను వధించిన శత్రువును క్షమించి వదిలేసిన స్త్రీమూర్తి
జ.ద్రౌపది
24. పిల్లలు పుడితే తన అందం చెడుతుందని సంతానోత్పత్తికై ఇచ్చిన ఫలాన్ని ఆవుకి పెట్టిన మహిళ.
జ. దుంధుళి (ఆత్మ దేవుని భార్య, గోకర్ణుని తల్లి).
25. ఎవరి కోరిక మీద రావణుడు శివుని ఆత్మలింగం భూమి మీదకు తేవాలనుకున్నాడు?
జ.తల్లి కైకసి కోరిక మేరకు.
🌹🌹🌹🙏🙏🙏సర్వేజనాసుఖినోభవంతు 🙏
No comments:
Post a Comment