Friday, March 10, 2023

ప్రశ్న: నా మనస్సు నిర్మలంగా రెండు మూడు రోజులుంటుంది - ఆ తరువాత బద్ధకంగా అయిపోతుంది, మళ్ళీ నిర్మలమవుతుంది - ఎందువల్ల ?

 *"శ్రీ రమణ మహర్షి బోధనలు"*
        🌼🍇🌼🍇🌼🍇🌼
             🌼🍇🕉🍇🌼
                   🌼🍇🌼
                         🌼
*"ప్రశ్న: నా మనస్సు నిర్మలంగా రెండు మూడు రోజులుంటుంది - ఆ తరువాత బద్ధకంగా అయిపోతుంది, మళ్ళీ నిర్మలమవుతుంది - ఎందువల్ల ?"*

*"జవాబు: అది సహజమే. స్వచ్ఛత, చలాకీతనం, బద్ధకం - అంటే సత్త్వరజస్తమోగుణాలు. ఒకదాని తర్వాత ఒకటి పని చేయటం వల్లనే.. బద్ధకం (తమస్సు) వచ్చిందని బాధపడకు. కాని సత్ప్వగుణం పనిచేస్తున్నపుడు దానిని విడువకుండా పట్టుకో. సాధ్యమైనంత లబ్ధిపొందు."*

*"ప్రశ్న: ఒకోసారి శరీరం ధ్యానాన్ని కుదరనీయదు. అందుకే యోగాభ్యాసాన్ని చేసి శరీరాన్ని లొంగదీసుకోవాలా ?"*

*"జవాబు: అది వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటుంది - జబ్బుని నయం చేసుకోవటానికి ఒకడు హఠయోగాభ్యాసం చేస్తాడు, మరొకడు భగవంతుడిని నమ్ముతాడు. ఇంకొంకడు తన సంకల్పబలాన్ని నమ్ముతాడు. నాలుగోవాడు ఆ జబ్బుని నిర్లక్ష్యం చేయవచ్చు ! అందరూ ధ్యానం చేసుకుంటూనే ఉంటారు. ఆత్మాన్వేషణే ప్రధానం. మిగిలినవన్నీ అప్రధానం."*

*"ప్రశ్న: ధ్యానం చేసుకునేటప్పుడు తాను ఆత్మసాక్షాత్కారం దిశగా పురోగమిస్తున్నానా లేదా అని ఎట్లా తెలుస్తుంది. దీనికి నిదర్శనాలేమిటి ?"*

*"జవాబు: అనవసరమైన ఆలోచనలనుండి విముక్తి, ఒకే భావం పై మనస్సు నిలవటం.. ఇవే పురోగతికి నిదర్శనాలు"*
           

No comments:

Post a Comment