Friday, March 10, 2023

మనసుకు కలిగే మొహం, ఆశలు నెరవేరితే అది నెమ్మదిస్తుందా ? ఇతర సాధనలు అవసరమా !?

 💖💖💖
       💖💖 *"492"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మనసుకు కలిగే మొహం, ఆశలు నెరవేరితే అది నెమ్మదిస్తుందా ? ఇతర సాధనలు అవసరమా !?"*

*"కనిపించే ఈ ప్రపంచం నాకు భిన్నంగా లేదు అనే సత్యం పరిపూర్ణంగా అర్థమైతే మనసు శాశ్వతంగా నెమ్మదిస్తుంది. అందుకోసమే భగవాన్ శ్రీరమణమహర్షి మనకు విచారణ మార్గాన్ని బోధించారు. మన ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. పెద్దలంతా ఏవో మాట్లాడుకుంటున్నా వాడి మనసంతా అద్దాల బీరువాలో కనిపించే ఆట వస్తువులు, బొమ్మల మీదనే ఉంటుంది. వాటిని ఎప్పుడెప్పుడు తీసి ఆడుకుందామా అని మనసు తహతహ లాడుతూ ఉంటుంది. ఈ బొమ్మలన్నీ నీకే అని మనం అనగానే వాడి మనసు ఆనంద పడటమే కాకుండా ఇందాకటి తపన కూడా లేకుండా పోతుంది. వాడికే కాదు మన మనసుకు కూడా అంతే. వస్తువు మనదే అనే భావన కలిగితే మనసు నెమ్మదిస్తుంది. ఇదంతా నాదికాదు అన్న బేధభావమే వస్తువులపై మోహం కలిగిస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment