🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"483"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"సుస్థిరమైన సుఖానుభూతి, ఏ మాత్రం దుఃఖస్పర్శ లేని స్థితి ఎక్కడుంది ?"*
*"అది నిద్రలో ఉంది ! కర్తృత్వం లేని క్షణం ఎంత సుఖంగా ఉంటుందో నిద్ర మనకు తెలియజేస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి భగవంతుడు శాశ్వతమైన సుఖాన్ని నిద్ర ద్వారా అందిస్తున్నాడు. నిద్రలేచిన తర్వాత పొందే అనుభవాలన్నీ సుఖ, దుఃఖ మిశ్రమాలుగా ఉంటున్నాయి. కేవలం నిద్రా సుఖం మాత్రమే ఏ దుఃఖస్పర్శకు తావులేనిదిగా ఉంటుంది. మన ప్రతి అనుభవానికి, సుఖదుఃఖాలకు మన ప్రమేయాన్ని ఆపాదించుకునే మనం ఒక్కసారి నిద్రానుభవాన్ని పరిశీలిస్తే సత్యం అర్థమవుతుంది. మనం అనుకున్నది సాధిస్తే లేదా అనుకున్నంత సంపాదిస్తే సుఖంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ సుఖానికి ఇవేవీ అవసరంలేదు. అందుకే ప్రతిప్రాణికి దైవం నిద్రను స్థిరమైన సుఖానుభూతిగా అందిస్తుంది. కర్తృత్వం లేని సమయంలో మనం పొందే అఖండ శాంతిని తెలుసుకోమని భగవాన్ శ్రీరమణమహర్షి నిద్రానుభవాన్ని ఉదహరించారు. మెలకువలో కూడా ఈ వివేకంతో మనం కర్తృత్వం లేకుండా ఉండగలిగితే, అదే సుఖం మనను అంటిపెట్టుకుని ఉంటుంది. మన ముందుకు వచ్చిన పనిని కర్తవ్యంగా, ప్రతిఫలంగా లభించే అనుభవాన్ని సంఘటనగా తీసుకుంటే సుఖదుఃఖాలకు అతీతంగా ఉండవచ్చు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment