*:::::: స్వేచ్ఛగా జీవించ గలమా?::::::*
మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని ఏమిటి? ఎలా చేయాలి? ఎందుకు చేస్తున్నాము? అనే వివరాలు మనం ముందుగానే తెలుసు కుంటాము.
అలాగే మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, మనస్సు, ఇవి వాటి వాటి విషయాలతో సంపర్కం లోకి వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది. ఉదా.. కన్ను, ఏమి చూడాలి?,ఎలా చూడాలి? ఎందుకు చూడాలి? అనే జ్ఞానంతో, చూస్తుంది.
అప్పుడు ఉన్నది చూడటం కాక , తాను ఏమి చూడాలో, ఎలా చూడాలో, అలా చూస్తుంది. అనగా చూపు జ్ఞాన సహాయం తో ప్రభావం చెంది వున్నది. అప్పుడు కన్ను చూచేది అంతకు ముందు వున్న దానినే కాని ఇప్పుడు వున్న దానిని కాదు.
ఈ రకంగా మన జీవితం, మనం ఎందుకు జీవించాలి? ఎలా జీవించాలి? అని మనకు సమాజం అందించిన జ్ఞానం ఆధారంగా జీవిస్తున్నామే కాని మన జీవితం మనం ఇష్ట పడే లాగా, మనదై, స్వతంత్రమై, స్వేచ్ఛగా లేదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment