#మిరాకిల్
ఒక చిన్న పిల్లాడు మందుల షాపు ముందు నిలుచుని " " "మిరకిల్" మందు ఉందా? నా డబ్బాలో దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేస్తాను...ఏడుస్తూ అడిగాడు.
షాపు వానికి అర్ధం అయింది. కాని సమాధానం ఎలా చెప్పాలో తెలియడం లేదు.
కావాలంటే ఇంకా తెస్తాను. అమ్మ ఇంట్లో ఎక్కడైనా దాచిందేమో వెతుకుతా! స్నేహితులను అడుగుతా! "మిరకిల్ " మాత్రమే మా నాన్నను బ్రతికిచగలదని మా అమ్మ చెబుతుంది. అప్పటికెే ఆ పిల్లాడు బాగ ఏడ్చినట్లుగా బుగ్గల పై కన్నీరు చారలుకట్టి ఉంది. మందుల షాపు వాడి కళ్ల లో నీళ్లు తిరాగాయి. సమాధానం చెప్పలేని పరిస్ధితి.
ప్రక్కనే ఓ పెద్ధాయన నిలుచుని ఉన్నాడు. ఆ పిల్లాడిని చూసి కదిలిపోయాడు. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? అని అడిగాడు. ఆ పిల్లాడు తెచ్చుకున్న డబ్బాలో "చిల్లర నోట్లు ...కాయన్స్ ఆ పెద్ధాయన చెేతిలో పోసాడు. అంతా కలిపితే మూడు వందల డబ్బై రెండు రూపాయలు. ఇంకా తెస్తాను... మా నాన్నకు మిరకిల్ మందు ఇవ్వండి ...ఏడుస్తున్నాడు పిల్లాడు.
సరే! నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్లు ...అని ఆ పెద్దాయన ఆ పిల్లాడు ఇచ్చిన డబ్బులు జేబులో వేసుకుని ....చిన్ని చేతి వేలు పట్టుకుని ఆ పిల్లాడి ఇంటికి వెళ్లాడు.
అక్కడ పరిస్ధితి దయనీయం గా ఉంది. ఆ అబ్బాయి తల్లి కామోసు! పిల్లాడి తండ్రి ప్రక్కన కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూంది. డాక్టర్ రిపోర్ట్ "బ్రైయిన్ ట్యూమర్ " పీక్ స్టేజ్ లో ఉంది. చాల కర్చుతో కూడిన పని....అక్కడ ఇంటి పరిస్ధితి చూసి అతను అర్ధం చేసుకున్నాడు.
ఆ తరువాత.....చక చకా ....పేషెంట్ ను ప్రసిద్ధి గాంచిన హాస్పిటల్ కు తరలించడం..... ఆపరేషన్ జరగడం.... ఆ పిల్లాడి తండ్రి ప్రాణం నిలవడం జరిగింది.
ఆ పెద్ధాయన ....మంచి మనస్సున్న నిపుణుడైన న్యూరో సర్జన్ . ఆ డాక్టర్ ఆ పిల్లాడు ఇచ్చిన డబ్బులు ఆయన బద్రం గా డబ్బాలో దాచుకున్నాడు.
పిల్లాడి కళ్లలో మతాబులు పూసాయి. డాక్టర్ ఆనందం తో ఆ పిల్లాడితో ఇలా అన్నాడు .... "మిరకిల్ మందు" ఖరీదు "మూడు వందల డబ్బై రెండు రూపాయిలే! నీ డబ్బులు కరెక్టుగా సరిపోయాయి.
ఆ పిల్లాడు సృహలోకి వచ్చిన వాళ్ల నాన్నతో అంటున్నాడు.... డాడి ! నాకు మిరకిల్ మందు దొరికింది... కరెక్టు గా ఖరీదు నా డిబ్బీలో మూడువందల డబ్బై రెండు రూపాయిలే! సంబరం గా అంటూంటే ....చుట్టూ ఉన్న వాళ్లంతా ఆనందం తో కన్నీటి పర్యంతం అయ్యారు.
ఎవరన్నారండి? దేవుడు లేడని.....పసి పిల్లలు పిలిస్ధే దేవుడు ఇలా " మిరకిల్ " రూపం లో వస్తాడు.
No comments:
Post a Comment