*ఏది లాభము - ఏది నష్టము*
మనము ప్రతిజన్మలో ఏమి నష్ట పోతున్నామో ఏమీ కోల్పోతున్నామో చూడలేక తెలుసుకోలేక ఉన్నాము. మానవజన్మ తెలుసుకుంటే అద్భుతమైన జీవితం తెలుకోకపోతే అజ్ఞాన భాదాకర జీవితం.గడిచిన 30 లేదా 50 యేండ్లు చూస్తే జీవితం క్షణకలమేనా అనిపిస్తుంది అందుకే జీవితం క్షణ భంగురమన్నారు. దైవచింతన, శ్రద్ధ,కొరికలు లేని వాని పుణ్యం భగవదర్పితమై ఫలసిద్ధి కలుగును. లౌకికుని పుణ్యం జన్మజన్మకు రంద్రాల గల పాత్రలో చేరి హృదావుతుంది. ఒకే జన్మలో ఏవరు మహాజ్ఞాని మహాభోగి కాలేరు అది ఏన్నో జన్మల శ్రమ ఫలితం. ఒకటి వెలుగు,పది మందికి ఫలాలను ఇస్తుంది. మరొకటి చీకటి, ఉనికిని కోల్పోతుంది.
మనం ప్రతి జన్మలో అల్ప సుఖాలనే కోరికల కోసం జన్మను,కష్టాన్ని కాలాన్ని,పుణ్యాన్ని ప్రతిసారి ప్రతిజన్మలో కోల్పోయి వృథా చేసుకొని నష్టపోతున్నాము. 100 రూ:లు లేదా వస్తువు పగిలిపోయిన పోగొట్టుకున్న తెగ భాధపడి పోతాము. బజారులో ఒక వస్తువు కోసం అన్ని చోట్ల విచారిస్తాము బేరమాడుతాము. అసలు మన జన్మ అనే జీవితంలో ఏమేమి యేనేన్ని కోల్పోయి ఏన్నిసార్లు మోసపోతున్నమో బాగా విచారించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. వీటికి కాలేజీలు యూనివర్సిటీలు లేక పోవడమే కారణం.
జన్మే లేకుంటే ఒకే జన్మే అవుతే సంతోషంగా మనకు నచ్చినట్లు జీవించచ్చు.దైవం,భక్తి ,భయం పూజ అవసరం లేదు కదా ! కానీ ఒక పద్ధతిగా కొంతలో కొంతైన కొన్ని పాటిస్తున్నాము ఆంటే పాప పుణ్యాల,మంచి చెడు గురించి అలోచిస్తున్నమంటే తెలియకుండానే సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాము. కొందరు మరోజీవితాన్ని ఏవరు చూశారు అనుకోవచ్చు.కానీ భౌతికమైన జీవనమార్గంలో చక్కగా చూస్తూ మాట్లాడుతూ తిరుగుతూ తెలివి,బుద్ధిని ఇచ్చినందుకు తృప్తిపడి దైవాన్ని గుర్తించి ఋణం తీర్చుకోవాలి. భౌతికంగా ఏంత ఏదిగిన అంతే నష్టం కలుగుతుంది.
ప్రపంచమనే ఎండమావిలో ఎప్పటికి ఏజన్మకు దాహం తీరదు.ఎంత అవసరమో అంతే నడవాలి లేదా కోటి జన్మలైన తెచ్చిపెడుతుంది.ఏది లాభమో ఏది నష్టమో ఏది శాపమో ఏది అదృష్టమో ముందు చక్కగా గ్రహించాలి. కాలము,జీవితం ఏంతో విలువైనది కొంత దైవచింతనతో గడపడం సముచితం. కలియుగంలో ఒకటి లేదా రెండు సార్లే మానవజన్మ లభిస్తుంది. గతంలో ఏ వసతులు లేకుండా తిండి కోసమే కష్టపడి పనిచేసి జీవించేవాండ్లు.ఇప్పుడు అన్ని వస్తువులతో సంతోషంగా ఉండే కాలంలో భగవంతుడు జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతతో రోజుకు కొంత సమయం దైవానికి కేటాయించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్థాము.
No comments:
Post a Comment