*🕉️మంచి ఆలోచనలు, చేతలు చెడు ఫలితాలను ఇవ్వలేవు. అలాగే చెడు ఆలోచనలు,ఆచరణలు, చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేవు. అంటే వరి విత్తితే వరే వస్తుంది గానీ, జొన్న రాదు. ముళ్ల చెట్లు నాటితే ముళ్ల కంపే వస్తుంది కానీ మరొకటి రాదు*. *తెలిసి కానీ,తెలియక కానీ ఏది విత్తామో అదే మొలకెత్తుతుంది.*
*ప్రకృతిలోని ఈ న్యాయ సూత్రాన్ని మనం సులువుగా అర్ధం చేసుకుని దానితో సహకరించి పనిచేస్తాం. కానీ,నైతిక,మానసిక ప్రపంచం విషయానికి వస్తే ఈ మౌలిక సూత్ర రహస్యాన్ని బహు కొద్దిమంది మాత్రమే గుర్తిస్తారు*. *భౌతిక ప్రపంచంలో ఈ సూత్రం ఎంత సూటిగా,సరళంగా ఉందో,మానసిక ప్రపంచంలో కూడా అంతే సూటిగా,సరళంగా వుంది. కాని దానిని గ్రహించలేక పోవడం వలన దానితో సహకరించరు. బాధలు,కష్టాలు ఎల్లప్పుడూ ఏదో తప్పుడు ఆలోచనల ఫలితమే. మనతోనూ,మన వునికిని నిర్దేశించే మౌలిక నియమంతోను మనం సామరస్యాన్ని కోల్పోయాం అనడానికి కష్టాలు ఒక సంకేతం*. మనలో వ్యర్థమైన,మాలిన్యమైన దాన్నంతిటిని కా ల్చి, భస్మం చేసి మనల్ని శుద్ధి పరచటమే కష్టాల ఏకైక మహత్తరమైన ఉపయోగం. నిర్మల మనస్కులకు కస్టాలుండవు. శుద్ధి పరచిన బంగారాన్ని కాల్చడం వలన.ప్రయోజనం ఏముంటుంది? నిర్మలమై,జ్ఞానోదయం చెందిన వ్యక్తి కష్టాల పాలు కాలేడు.
🕉️🙏
No comments:
Post a Comment