*కష్టాలను అధిగమించి బ్రతకడమే జీవితం*
*ఒక నదీతీరాన ఒక గురువు ఆశ్రమం ఉన్నది. ఒక రోజు శిష్యులు నదికి నీరు తేవడానికి వెళితే. ఒక వ్యక్తి చనిపోవాలని నది నందు దూకుతాడు. శిష్యులు అతనిని రక్షించి ఆశ్రమానికి తీసుకు వచ్చారు. ఎందుకు నాయనా చనిపోవాలని ప్రయత్నించావు? జీవితంలో అన్ని కష్టాలే. విసిగి వేసారిపోయాను. ఈ కష్ణాలతో జీవించలేక చావే శరణ్యమని భావించి అలా చేశాను. స్వామీ. ఇంతలో శిష్యుడు సీతాపలం పండ్లను కోసి బుట్టనిండా తెచ్చాడు. అతనికి ఒక పండును ఇచ్చి ఆరగించమని గురువు చెబుతాడు. అతను తొక్కను గింజలను పడవేసి గుజ్జును తింటాడు. అప్పుడు గురువు పండులో గింజలు తొక్క ఉందని పడవేశావా? లేదుకదా, అలాగే జీవితంలో సమస్యలుంటాయి. వాటికి దూరంగా పారిపోము. జీవితాన్ని ముగించుకోము. పండులోని తొక్కను పడవేశినట్లే జీవితంలో చెడ్డవారికి చెడ్డ ఆలోచనలకు దూరంగా బ్రతకాలని చెబుతాడు. గింజతో పాటే గుజ్జు ఉంటుంది. జీవితంలోను సుఖాలతొ పాటు కష్టాలు ఉంటాయి. గింజలను నోటిలో వేసుకొని ఉంచేసినట్లే జీవిత సమస్యలను పరిష్కరించుకోవాలి. లేకుంటే వాటిని వదిలి వెయ్యాలి. పండులోని గుజ్జును అనుభవించినట్లే నీకు ప్రసాదింపబడిన జీవిత మకరందాన్ని జుర్రు కోవాలి.*
No comments:
Post a Comment