Monday, October 16, 2023

హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, అంధకారంలో భోజనం

 *365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో* 

 ♥️ *కథ-41* ♥️

 *అనుభూతి : చూడగలిగే నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను* 

 *అంధకారంలో భోజనం* 

 ఈ రోజు మూసిన కనులను, రేపటి కోసం మరల తెరవడానికి ముందు దయచేసి ఈ యదార్థ కథను పూర్తిగా చదవండి. ఒకరి అద్భుతమైన అనుభవాన్ని ఇక్కడ పంచుకోవడం జరిగింది.
  అంధుల సహాయకేంద్రంలో అంధ వికలాంగుల కోసం ఒక నిధుల సేకరణా కార్యక్రమానికి హాజరయ్యాను.
ఆరోజు శుక్రవారం సాయంత్రం కావడంతో, ముందు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాలని అనుకున్నాను. ఈ కార్యక్రమం కాస్త విసుగు తెపిస్తుందేమోనని భావించి, సాయంత్రాన్ని విశ్రాంతంగా ఇంకో విధంగా గడపవచ్చని అనుకున్నాను.
కానీ ఒంటరిగా ఉండటం వలన, సమయం గడపడం కష్టంగా అనిపించడంతో, చివరికి నేను ఆహ్వానాన్ని అంగీకరించాను. బుకింగ్ కోసం ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకున్నాను. 
  నేను అక్కడికి వెళ్లేసరికి దాదాపు 40 మంది ఉన్నారు.  ప్రారంభంలో, అంధ వికలాంగుల కేంద్రం గురించి మాకొక వీడియో చూపించారు. 15 నిమిషాల నిడివి గల ఆ వీడియో ద్వారా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా  అంధులతో తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో చూపించడం చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది.
వీడియో తర్వాత, మేమందరం ఒక హాలులో సమావేశమయ్యాక, తదుపరి కార్యక్రమం గురించి వివరించారు.
తదుపరి కార్యక్రమం యొక్క విషయం "డైనింగ్ ఇన్ ది డార్క్" (అంధకారంలో విందు).
ఈ కార్యక్రమం అత్యంత స్ఫూర్తిదాయకంగా, శ్రేష్ఠమైనదిగా, అందరితో పంచుకునే విధంగా మారింది ...

దాని అర్థం ఏమిటంటే, మేం 40 మంది చిమ్మచీకటిగా ఉన్న ఒకగదిలో భోజనం చేయబోతున్నాం అన్నమాట!
తరువాతి రెండు గంటలు ముగ్గురు అంధ యువకులచే ప్రణాళిక చేయబడి, నిర్వహించబడి, నిర్దేశించబడి, అమలు చేయబడింది.
ఒక అమ్మాయి, ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించేలా, ఇద్దరు అబ్బాయిలు ఆమెకు సహాయం చేసేలా, ఆ ముగ్గురూ, ఒక అంధ వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అంధ నాయకురాలు మొదట మా భోజనానికి సంబంధించిన చిట్కాలు చెప్పింది.  (అవి అంధులు తమ జీవితాన్ని సులభతరం చేయడానికి అనుసరించే వాస్తవ ప్రమాణాలు)
   1. మీరు మీ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు, వస్తువులు ఈ క్రింది విధంగా ఉంటాయి:
      మీ ప్లేట్ యొక్క 3 గంటల కోణంలో: మీరు ఒక చెంచాను కనుగొంటారు
      9 గంటల కోణంలో: ఫోర్క్
     12 గంటల కోణంలో: గిన్నె
     2 గంటల కోణంలో: ఖాళీ గ్లాస్ డిష్ 
    మధ్యలో 6 గంటల కోణంలో పేపర్ నాప్కిన్ ఉంటుంది.

  2. రెండు పెద్ద కూజాలు మీవద్దకు తీసుకురాబడతాయి. సాదా అంచులతో కూడిన కూజాలో నీరు ఉంటుంది,  
      వంకరగా ఉన్న అంచుతో కూడిన కూజాలో నారింజ రసం ఉంటుంది.

  3. మీ అభిరుచికనుగుణమైన కూజా మీ వద్దకు వచ్చినప్పుడు, దాని నుండి జ్యూస్ లేదా మంచినీళ్లు మీ గ్లాసులో పోసుకోవాలి. మీ చూపుడు వేలును గ్లాసులో ఉంచడం ద్వారా దానిని నింపినప్పుడు, ద్రవం మీ వేలికి తాకగానే, మీరు పోయడం ఆపివేయాలి.
 అందరికీ అర్థమైందా అని అడిగింది.
అందరూ అవునన్నారు, కానీ అందరూ అయోమయంలో పడ్డారు, ఒకరినొకరు అడిగి ధృవీకరించుకుంటూ, ఆమె చెప్పినదాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
తరువాత మేం గడిపిన ఒకటిన్నర గంటలు చాలా సరదాగా, బోధనాత్మకంగా గడిచింది.  
మేం ఏమీ చూడలేని చిమ్మచీకటి గదిలో, వివిధ రుచికరమైన ఆహార పదార్థాలను చూడకుండా, వాటిని ఆస్వాదించాము!
ముందుగా, మా 40 మందిని బృందాలుగా చీకటిగదిలోకి తీసుకువెళ్లారు. మేం కుర్చీపై కూర్చునే వరకు ప్రతి ఒక్కరికీ ఒకొక్కఅంధుడు సహాయం చేసాడు. 
అంధులకు వారి గమ్యస్థానాన్నిమార్గనిర్దేశం చేయవలసిన మేము, వారి నుండి సహాయం పొందడం, ఒక ఇబ్బందికరమైన అనుభూతిని కలుగజేసింది..
రకరకాల పళ్లరసాలు, ఎపిటైజర్స్ (సూప్), సలాడ్, మెయిన్ కోర్స్, స్వీట్ – ఇలా పూర్తి 5 - రకాల విందును, ఆ ముగ్గురు అంధుల బృందం మాకు అందించింది.
  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ అంధులబృందం శాఖాహారులు కూర్చున్న చోట మాత్రం శాఖాహార వంటకాలను మాత్రమే వడ్డించింది - కానీ మేమంతా గదిలో  యథేచ్ఛగా, రకరకాలుగా కూర్చున్నాం !
ఆన్లైన్లో నమోదు చేసుకునేటప్పుడు, "వెజిటేరియన్" లేదా "నాన్-వెజిటేరియన్"  ఎంచుకోమని మమ్మల్ని అడిగారు. నేను శాఖాహారిని కాబట్టి అదే ఎంచుకున్నాను. మేము వడ్డనల మధ్య వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చాలా బాగా ఆతిథ్యం వహించారు.   ఒక వంటకం పూర్తి చేసిన వెంటనే, ఆలస్యం లేకుండా తదుపరి వంటకం అందించబడింది.
  దాదాపు గంటన్నర చీకటిలో భోజనం చేసిన తర్వాత, అందరూ తినడం ముగించారా అని నాయకురాలు అడిగింది.  
నిర్ధారణ చేసుకున్నాక, గదిలో దీపాలు వేసి, మేము బయలుదేరవచ్చు అని చెప్పింది.
 కాసేపు ఎవ్వరం కదలలేకపోయాం.  మేమంతా ఆశ్చర్యంతో గది అంతా చూస్తూండిపోయాం. తర్వాత అందరం లేచి టీమ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ నెమ్మదిగా బయలుదేరాం. 
కన్నీళ్లతో భోజనాల గది నుండి బయటకి వచ్చాం, కానీ ఇప్పుడు మా స్వంత జీవితాల గురించి మరింత స్పష్టమైన దృష్టితో ఉన్నాం.
అందమైన కళ్లతో, ఈ అందమైన ప్రపంచాన్ని చూసే మనం ఎంత అదృష్టవంతులమో, మనకు ఎంత విలువైన బహుమతి దక్కిందో గ్రహించుకున్నాం.
 ప్రపంచంలో దేనినీ చూడలేని అంధుల, ( ఇతర వికలాంగుల) జీవితాలు ఎంత కష్టతరమో మేం గ్రహించాం.
కేవలం రెండు గంటలపాటు ఏమీ చూడలేకపోవడం వల్ల ఎంత అసౌకర్యానికి గురయ్యామో, అలా వారు తమ జీవితాంతం ఎలా జీవిస్తున్నారో మేం గ్రహించాం.

  మనం ఎంత అదృష్టవంతులమో, జీవితంలో మనకున్న ఎన్నోసాధారణ విషయాలకు మనం విలువ ఇవ్వడం లేదని తెలుసుకున్నాం!  
మనం చాలా దుఖిస్తాం (కొన్నిసార్లు బిగ్గరగా, కొన్నిసార్లు లోలోపల), మనవద్ద ఉన్న వాటిని అభినందించడానికి సమయం తీసుకోకుండా, మనకు లేని వాటి కోసం మన జీవితమంతా  పరిగెడుతూనే ఉంటాం... 

  ఉల్లాసంగా ఉండండి.
మీ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోకముందే,  ఈరోజే కళ్ళు తెరవండి.
మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను ఆరాధించండి, ఈ రోజు వారితో మనస్సు విప్పి మాట్లాడండి.
 మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో  మీకున్న అపార్థాలను పరిష్కరించుకోండి.
మీ జీవితాన్ని, ఈ భూమిపై జీవించడానికి యోగ్యమైనదిగా చేసుకోండి.
మీ దృష్టిని నిల్పి, మీ జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయండి.

♾️
               
 *మనం ఎల్లవేళలా ఫిర్యాదు చేసే అంశాలు మన అంతర్గత స్వభావాన్ని మారుస్తాయి. మన వద్ద ఉన్నవాటి పట్ల కృతజ్ఞత,* *మనలో మరొక  ఉన్నతమైన ఆవరణను సృష్టిస్తుంది. 🌼* 
  *దాజీ* 


  హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

HFN Story team
💜🧘‍♀️🔺🧘‍♂️💜🧘‍♀️🔺🧘‍♂️💜

No comments:

Post a Comment