*తెలుసుకొని మసులుకో!*
*ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి? ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి.*
*ఒక్క నిమిషంలో నీ జీవితం మారదు. కానీ ఒక్క క్షణంలో నీవు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది.*
*కోట్లు సంపాదించిన వ్యక్తిగా ఉంటావా? లేక కోట్ల మందిని పాలించే ప్రభువుగా వుంటావా?*
*నీవు గడిపే సమయాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది.*
*మీ మనసుకు శిక్షణ అవసరము. మరి మనసుకు పరిపక్వత వచ్చినది అని భ్రమపడి ప్రేమ ముగ్గులో దోకవద్దు.*
*నీ కంటికి, మనసుకు కామన్ సెన్స్ ఉండదు. నీ మైండ్ తో, బుద్ధితో, ఆలోచించుకుని అడుగు వెయ్యి.*
*క్షమించటం ముఖ్యం కాదు. ఎందుకు క్షమాపణ చెప్పినది అర్థమయ్యేటట్లు చెప్పాలి.*
*ఇతరులు మనకు అపకారాలు చేసిన ఇసుకపై రాయి. మనకు చేసిన ఉపకారాలు చలవరాతి పై చెప్పు.*
*ద్వేషించటానికి నీకు టైం చాలదు, ఎంతసేపు ఎదుటివారిని ప్రేమించటంలో సరిపోతుంది అని సంతృప్తి పడండి.*
*మీకు మనశ్శాంతి కావాలంటే*
*1) నీకు కీడు చేసిన మర్చిపోలేని వారిని క్షమించటం.*
*2) క్షమించలేనివారిని మర్చిపోండి.*
*గ్యారెంటీ, వారంటీలేని నీ జీవితానికి కోపము, అసూయ, అహంకారము, ఎందుకు? బతికిన నాలుగు రోజులు నలుగురితో ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా బతకాలి. పోయేటప్పుడు నీ డబ్బు, నీ హోదా ఇవి నీతో రావు కదా!*
*మహాత్ములకు వాక్కు కన్నా గొప్ప భూషణం లేదు. ఆ వాక్కు ద్వారా మానవ వికాసము, దిక్సూచి, ప్రోత్సాహము, మార్గ నిర్దేశం చేసే పని, మీ విలువైన సమయం వెచ్చించి యువతకు సద్బోద చేసి, సన్మార్గంలో పెట్టాలి.*
*గుళ్ళు, గోపరాలకు వేలు, లక్షలు ఉదారంగా ఖర్చు చేస్తారు. కానీ భాగవతం లాంటి పుస్తకాన్ని ఇతరులకు పంచి పెడితే, ( పుస్తక దానం) చేపలను ఇవ్వటానికి బదులు చేపలు పట్టుట నేర్పినవారు అవుతారు మీరు.*
*శ్రీ మహాలక్ష్మి సైతము భగవంతుడి పాద దూళికణాలను, గుణాలు, లెక్కపెట్టలేదు. అనంత ఉపకారము మనకు చేసిన ఆ భగవంతుడికి కృతజ్ఞత ఎలా? ఎంత చెప్పాలి? చింతించాలి, స్మరించాలి, ఆలోచించండి?*
*దేవుడు మనకు విధించిన శిక్షలను మన మంచి కోసమే ఇచ్చాడని అతనిపైన రెట్టింపైన భక్తితో స్వీకరించాలి. అప్పుడే అతడు నిజమైన భక్తుడవటానికి సాధ్యం.*
*శ్రీహరి శక్తిని ప్రసాదించి చేయించిన దాన్ని తనే చేసాననుకోవటం మహాపరాధం అవుతుంది. భగవంతుని స్వాతంత్రాన్ని తన పైన వేసుకుని తను స్వతంత్రుడని ఒప్పుకున్నట్లు కాదా! ఇది భగవంతుని ద్వేషించినట్లు అవుతుంది.*
*దేవుడు స్వతంత్రుడు. సర్వగుణ పరిపూర్ణుడు, దోషాలు లేనివాడు. సృష్టి, స్థితి, సంహారము, నియమనము జ్ఞానము, అజ్ఞానము, బంధము, మోక్షము. ఇవన్నీ విశ్వమునకు ప్రసాదించువాడు. అంటే ఎవరికీ సాధ్యము కాని అసాధారణ వ్యక్తిత్వము దేవునిది. దేవుడు సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు, సర్వశక్తుడు, జనన మరణ రహితుడు, జ్ఞానానందక స్వరూపుడు నిత్యముక్తుడు. వేదాతిహాస, పురాణ, ఉపనిషత్తులలో ఎవరిని దేవుడని పిలిచారో, అతడే దేవుడు. మన సమాజము ఇప్పుడైనా మేల్కొని శ్రీ హరిణి దేవుడిగా బ్రహ్మాది దేవతలను అతని భక్తులుగా కొలుస్తూ వారి పేర్లనే పట్టుకుంటూ అటువంటి భావ చిత్రాలనే గృహాలలో వేసుకుంటూ, పరమ సాత్విక జీవితాన్ని సాగించుదాం!🙏*
No comments:
Post a Comment