*🙏🏻🌺 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌺🙏🏻*
🌷Message of the day 🌷
*_🌴 పిల్లలకు ఏది అవసరం అనేది తల్లీదండ్రులకు బాగా తెలుస్తుంది. కావాలని అల్లరి చేసినంత మాత్రానా వాళ్లకి నష్టము, కష్టము కలిగించేది ఇవ్వగలరా!! లేదు కదా!! భగవంతుడు కూడానూ మన అందరికీ తల్లిదండ్రీ. కష్ట నష్టములు సంగతి తెలియకుండా అది కావాలి, ఇది కావాలి అని మనం అడుగుతున్నాం, ఇవ్వలేదు అని నిందలు వేస్తాం, తిట్టుకుంటాం.. కానీ ఆయన మనకు కష్ట నష్టములను కలిగించేది కాకుండా, మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే ఇస్తాడు.. పిల్లల్ని తల్లిదండ్రులు కన్నా ప్రేమించేవారు ఎవరుంటారు!? మనందరం భగవంతుని పిల్లలం.. ఆయన కన్నా మనల్ని ప్రేమించేవారు ఎవరూ ఉండరు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి.. అది కావాలి, ఇది ఇవ్వలేదు అని పిర్యాదులు, వాదనలు చేయకుండా నీకేమి కావాలో భగవంతుణ్ణి నిర్ణయించనివ్వు.. నీకు మంచిదే, గొప్పదే ఇస్తాడు.🌴_*
No comments:
Post a Comment