1955వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన యదార్థ సంఘటన..
విజయవాడ #కనకదుర్గ అమ్మవారి పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు..
ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది..
విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు.. కాయకష్టం మీదే బతికేవాడు..
అప్పట్లో #రోజులుమారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు..ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి..ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఎర్రటి చీర నుదుటున పెద్దబొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ వచ్చి ఢిలవెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.
అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది..అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అంటే...దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న 'ఆవిడ మా అమ్మ.. తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు' అంటాడు.
కొంతదూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అనగా వెనక నుండి సమాధానం లేదు..వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో...చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది..అదేంటీ అమ్మా డబ్బులు ఇవ్వలేదు అని వెంకన్న అడగగా.. నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది.. అందులో చూసుకోగా ఒక బంగారు గాజు, పదిరూపాయల నోటు ఉన్నాయి.
వెంటనే ఆయనకి అర్ధమవుతుంది. తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్నఅమ్మ అని..దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరు పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగగా వారికి జరిగింది చెప్పగా..అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్ధమవుతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో గాజు ఫోటోతో సహా ప్రచురించారు.
ఓం శ్రీ మాత్రే నమః 🙏
🌺🌺🌺
No comments:
Post a Comment