Monday, April 22, 2024

ఫలితం అనుకూలమా .. ప్రతికూలమా అనే ప్రశ్నే లేదు నీ శక్త్యానుసారం చేయటమే

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ : 🙏

ఫలితం అనుకూలమా .. ప్రతికూలమా అనే ప్రశ్నే లేదు నీ శక్త్యానుసారం చేయటమే 

నా ప్రారబ్దం అని వదిలేస్తే తమోగుణం .. ఫలిత్సంతో సంబంధం లేకుండా నీవు లేవ వలసిన సమయానికి లేవవలసిందే .. నీ ప్రయత్నం .. సాధన నీవు చేయవలసిందే .. లక్ష్యానికి చేరతావో చేరవో .. అది సత్యం 

కర్మ సూత్రం సత్యమే అయినా .. కర్మ ఫల ప్రదాత అయిన ఈశ్వరుని పరమాత్మని దృష్టిలో పెట్టుకొని .. దివ్యజీవనాన్ని జీవిస్తే కర్మ బంధించదు .. సుఖ దు:ఖాల యందు సమభావం వస్తుంది .. ప్రభావితం కావు 

శరీరమే నేను గా ఉంటే మన సామర్ధ్యం 1% .. నేను ఆత్మ స్వరూపుడిని మన సామర్ధ్యం 100% ..  దైవ సంకల్పం మేరకే పని చేసే వాడికి ఓటమి లేదు 

స్వబుధ్ధి పనిచేసిన దగ్గర నుండి స్వీయ కర్మ పని చేస్తుంది ..

సాధనతో కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయటం .. దివ్య జీవనం అవుతుంది 

బుధ్ధిని ఆత్మ భావనలో నిలిపి చేస్తే శ్రీరామ చంద్రుడివి .. లేకుంటే రావణాసురుడివి 

ప్రత్యగాత్మ స్థితి నుండి పరమాత్మను దర్శించటం .. దర్శనం 

సాంఖ్య దర్శనం - యోగ- ఉత్తర మీమాంస - పూర్వ - న్యాయ- తర్క .. షడ్దర్శనాలు 

సాధన పూర్వకంగా దివ్యజీవనాన్ని జీవించడానికి తొలిమెట్టు దర్శనం .. జీవాత్మ పరమాత్మల అభేధ నిర్ణయం దర్శనం 

కాల ధర్మాన్ని అనుసరించి కర్మ ఫలిస్తుంది .. సృష్టి అంతటికీ పరమాత్మ ఆధారం అయితే నేను కర్తను అంటున్నావు 

తత్వ జ్ఞానం దృష్ట్యా మంచి సాక్షియే ... సాక్షిత్వం కోల్పోయి చేసేది ఏదైనా చెడే .. ఏమి జరుగుతూందో అదే సత్యం .. సాక్షిగా ఆత్మగా .. 

శాస్త్ర మూలం .. గురు మూలం.. ఋషిమూలం వెదుక రాదు 

ఆసేతు హిమాచల పర్యటన చేసిన భగవత్పాదులు ఎవరినీ విమర్శించలేదు .. సంస్కరించారు అంతే .. ప్రజ్ఞను ధీ శక్తిలో నిలుపుకున్నారు కాబట్టి 

ప్రజ్ఞను నిరశిస్తే మిగిలేది అచలం 

అంత:కరణకు .. కర్మకు లోబడటం మానవుని బలహీనత 

మౌన వ్యాఖ్యగా తెలుసుకున్నదే సుజ్ఞానం ... గురువు గారి మౌనాన్ని అర్ధం చేసుకోవటమే గురువుని ఆశ్రయించటం 

అవగాహన జీవి యొక్క పరిపక్వతని బట్టి ఉంటుంది 

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 

సమాధానాలు 

జై గురుదేవ 🙏

No comments:

Post a Comment