కాఫీ కబుర్లు సంఖ్య 578 (ఏప్రిల్ 03 - 2024) వేసవి వచ్చేసింది.. ---- ఈ సంవత్సరం సమ్మర్ స్టార్టయ్యింది. వేసవి వచ్చేసింది.. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు ఎండ వేడిగాడ్పులు అధికంగా ఉంటాయి. 10 నుంచి 5 వరకు బయటకి వెళ్ళడం శ్రేయస్కరం కాదు.. ముఖ్యంగా 60 దాటిన వారు ఖచ్చితంగా పాటించాలి. శరీరాన్ని కూల్ గా ఉంచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వడదెబ్బకు గురవకుండా చూసుకోవాలి. ఉద్యోగరీత్యా లేదా అత్యవసర నిమిత్తం బయటికి వెళ్ళాల్సి వస్తే తలకి టోపీ పెట్టుకోవాలి.. గొడుగు పట్టుకోవాలి.. మంచినీరు ఎప్పుడూ మనతోనే ఉండాలి. సాధ్యమైనంత త్వరగా బయట పనులు ముగించాలి. వేసవిలో శరీరంలో నీరు త్వర త్వరగా evaporate ఐపోతుంటుంది గనుక అరగంటకోసారి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. నిమ్మరసం, దోసకాయ, మింట్, మజ్జిగ, పెరుగు, కొబ్బరి నీరు, ఖర్బూజ వంటి చల్లదనాన్నిచ్చే ఆహారం ఎక్కువగా తీసుకుంటుండాలి. ఆవకాయలకి ఐస్క్రీమ్ లకి దూరంగా ఉండాలి వేసవికాలం లో. మంచి పోషక విలువలున్న రాగి పౌడరు చల్లని మజ్జిగలో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకుని తాగితే.. బెస్ట్ ఫుడ్ అవుతుంది మన శరీరానికి ఈ వేసవిలో. అసలు సీజన్ తో నిమిత్తం లేకుండా రోజుకోసారి ఈ పానీయం తీసుకుంటే ఎంతో మంచిది. వేసవిలో ఐతే మరోసారి కూడా తీసుకోవచ్చు. కాఫీ టీ వంటి వేడి పానీయాలు తీసుకుంటే ఉదయం 7 గం. లోపు, సాయంత్రం 5 గం. తర్వాత మాత్రమే.. అది కూడా రోజుకి రెండు సార్లు మించకుండా తీసుకోవాలని వైద్యుల సలహా. మైండ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమే ఈ వేసవిలో. పిల్లలపై అరుపులు, వాదనలు వాగ్వివాదాలు (మరీ ముఖ్యంగా భార్యతో) లేకుండా చూసుకోవాలి. లేకపోతే బుర్ర వేడెక్కిపోయి బ్లడ్ ప్రషర్ లో హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి. ఇది ప్రమాదకరం ముఖ్యంగా వేసవి రోజుల్లో. ఇక వస్త్రధారణ లో కూడా కూల్ ని పాటించాలి. దుస్తులు బిగుతుగా ఉండకూడదు. కాటన్ వస్త్రాలే ధరించాలి. సిల్క్ పట్టు బట్టలు ధరించడం శ్రేయస్కరం కాదు. వేసవి వచ్చేలోపే ఏసి లు సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్ పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి. బయటకెళ్ళి నప్పుడు మాస్క్ ధరించాలి. వేసవిలో స్నానంకి కెమికల్స్ ఉన్న సబ్బులు వాడకూడదు. వేసవి రెండు మూడు నెలలు డెట్టాల్ సోప్ లేదా నిమ్మ వేప ఉన్న సబ్బులు వాడటం ఉత్తమం. ముఖానికి ఏ టాల్కం పౌడర్ వాడినా ఒంటికి మాత్రం కూల్ మింట్ గల ప్రిక్ లీ పౌడర్స్ మాత్రమే వాడాలి. ఇవన్నీ మనం సులభంగా తీసుకోదగ్గ జాగ్రత్తలే. సో.. ఈ వేసవిని ఆనందంగా ఆహ్వానిద్దాం.. పై జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్ గా ట్రావెల్ అవుదాం.. అందరికీ హేపీ & సేఫ్ సమ్మర్ డేస్.. ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852...
No comments:
Post a Comment