మిత్రమా..."భూములు పోతాయ్, వస్తాయ్... డబ్బులు పోతాయ్, వస్తాయ్...
మనుషులు పోతారు, కొత్తవారు వస్తారు..... కానీ వారితో గడిపిన జ్ఞాపకాలు హృదయం లో నిలిచే వుంటాయి.... బంధాలు కూడా పోతాయ్, కొత్తవి వస్తాయ్.... కానీ ఆ బంధం తాలూకూ మధురిమ మనస్సులో నిండే వుంటుంది....
కోటలు కూలుతాయ్... కాలం పోతుంది.... మనం కూడా పోతాం.....
మరి ఇక్కడ మనదనేది ఏది?.....
ఇప్పుడు మన కళ్లముందున్న దృశ్యం....
మన మెదడులో మెదిలే ఆలోచన.....,
మన నరాల్లో సత్తువ.....,
మన గుండె చప్పుడు....., మనం పీల్చే ఊపిరి....., తాకే గాలి....,
ఇవన్నీ ఏం చెప్తున్నాయో ఎప్పుడన్నా ఆలోచించామా?....
ఈ పోస్ట్ చదవడానికి మనం వెచ్చించిన సమయం కూడా పోతుంది..... కానీ ఈ ఆలోచన మాత్రం నిలిచే వుంటుంది.....
కాలం ఓ చోట ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది..... అది ఉన్నప్పుడే అనుభవించాలి....., పోయాక ఎంత బాధ పడినా రాదు.... అది మనకు ముందూ ఉంది, మనం పోయాక కూడా ఉంటుంది...., మధ్యలో వచ్చి పోయిది మనమే...... లేని దాని గురించో...., రాని దాని గురించో....., ఎక్కువగా ఆలోచించి....., ఇప్పుడు మనతో ఉన్న కాలాన్ని.... స్నేహానుబంధాల్నీ.... కోల్పోకూడదు.... మనతో వున్న మనుషులు... హితులూ.... సన్నిహితులూ....స్నేహితులూ.... ముఖ్యం.....
రేపేంటి?....ఎల్లుండి ఏంటి?... పదేళ్ల తర్వాత ఏంటి?.... అని కాదు...., ఈరోజేంటి?..... ఇప్పుడేంటి?.... ఇప్పుడు మనతో ఉన్న క్షణం ఏంటి?..... దాన్ని మనం ఏం చేస్తున్నామ్?..... అనేది ముఖ్యం.....
మనతో ఉన్న కాలం
మాత్రమే మనది...,
అది చూపించే దృశ్యం...., వినిపించే ధ్వని...., మనల్ని తాకే స్పర్శ...., మనం పీల్చే గాలి...., మనం పొందే అనుభూతి...., అదే నిజం..... ఆ నిజం లోనే బ్రతకాలి.... లక్ష్యం వైపు సాగాలి.... జీవితానికి అర్థం....పరమార్ధం....
సాధించాలి...."
(వాట్స్ ఆప్ ఫార్వర్డ్ మెసేజ్)
No comments:
Post a Comment