రామాయణమ్. 35
...
అయోధ్యా నగర ప్రజలందరికీ పెద్దపండుగ .తమ ఇంట్లో తమ కుమారుడికే పెళ్ళి అయ్యిందన్న ఆనందంలో మునిగితేలారు వారు. అవును ! రాముడు ప్రతి ఇంటికీ పెద్దకుమారుడే ! ప్రతి ఇల్లాలు ఆయనను తన కొడుకుగానే చూసుకొని మురిసిపోతున్నది.
.
అయోధ్యా నగరపు ప్రతి ఆడుబిడ్డ ఆయనను తమ తోడబుట్టిన వాడుగానే భావిస్తున్నది .
.
ప్రతిపౌరుడు తమ యువరాజుని తమ స్నేహితునిగానే భావిస్తున్నాడు.
.
ఆ పురంలోని పశుపక్ష్యాదులకు కూడా రాముడంటే ప్రేమ !
.
ఇంతెందుకు అయోధ్యలోని జీవరాశుల ప్రాణాలన్నిటినీ ఒకచోట కుప్పగా పోస్తే అది దాల్చే రూపం "రామయ్య".
.
(ఒక మనిషి ఇంతమంది అభిమానాన్ని చూరగొనాలంటే ఆతని ప్రవర్తన,నడవడిక ,మాట,ఆయన మనస్సు ఎంత ఉన్నతమైనవిగా ఉండాలి !.మహర్షి వాల్మీకి మాటల్లోనే రాముని గుణగణాలు).
.
రాముడు సర్వలోక మనోహరుడు
అసూయ లేనివాడు,
ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తుడు (తొణకడు బెణకడు)
ఎవరైనా పరుషంగా తనతో మాట్లాడితే దానికి ప్రత్యుత్తరం చెప్పడు (non reactive behaviour).
.
ఎవరైనా చిన్న ఉపకారం చేసినా సంతోషపడిపోయి అది ఆ జన్మాంతము గుర్తుంచుకుంటాడు ,ఎవరైనా అపకారం తలపెడితే దానిని స్మరించడు!
.
శీలవృద్ధులు,జ్ఞానవృద్ధులు,వయోవృద్ధులు ,సత్పురుషుల వద్దకు తానుగావెళ్ళి మాట్లాడుతుంటాడు.
.
( ఈనాటి సమాజం వృద్ధుల అవసరమే లేనట్లుగా ప్రవర్తిస్తున్నది వృద్ధులకోసం ఆశ్రమాలు కట్టించి వారిని సమాజస్రవంతినుండి దూరం చేస్తున్నాం ,...మనకు తెలివితేటలు జ్ఞానం అధికంగా కలగాలంటే వృద్ధులను సేవించడమొక్కటే మార్గం ! ఆర్యచాణుక్యుడు ఇలా చెపుతారు ,జ్ఞానమ్ వృద్ధోపి సేవనమ్! అని).
.
ఆయన పరాక్రమవంతుడు ,ముల్లోకాలలో ఆయనను ఎదురొడ్డి నిలువగలవాడు లేడు !పైగా రాజపుత్రుడు ! కాబోయే సమ్రాట్టు! అయినా! ..తనకు కనపడినవాడిని అతనికంటే తానేముందు మధురంగా,మృదుమధురంగా పలకరిస్తాడు ,బుద్ధిమంతుడు!
.
బుద్ధి మాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవదః
వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః
.
(ఎంత అద్భుతమైన పదప్రయోగమో ! మధురభాషీ..మధురంగా మాట్లాడతాడట,... పూర్వభాషీ..=ముందుగానే మాట్లాడతాడట
ప్రియంవదః = ప్రియంగా పలుకుతాడట! )
.
అసత్య మాడి ఎరుగడు ,పెద్దలను సగౌరవంగా ఎదురేగి పూజిస్తాడు,
.
పనికిరాని ,, శ్రేయస్కరం కాని విషయాలను ,కార్యాలను పట్టించుకొనడు!
.
ఏ సమయంలో, ఏదేశంలో ఏపని చేయాలో చాలా చక్కగా తెలిసినవాడు .
.
లోపలున్నభావాలను ఏమాత్రమూ బయటకు తెలియనిచ్చేవాడుకాదు! ఆలోచనలను రహస్యంగా ఉంచుకుంటాడు(మంచి Administrator కి అత్యంత అవసరమైన లక్షణం).
.
మొండిపట్టుదల లేనివాడు ( highly flexible)
.
ఇతరులలోని దోషాలనే కాదు ! తనలోని దోషాలను కూడా గుర్తించగలవాడు .
(ఈ జ్ఞానం మనకెప్పటికైనా కలుగుతుందా అని ప్రశ్న వేసుకుంటే ! కలుగుతుంది అని సమాధానం వస్తుంది!
కానీ ఎప్పుడు!? ,ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనని మనం బయటివ్యక్తిగా భావించి మనలోకి మనం తొంగిచూసినప్పుడు! మన ప్రతి అడుగును శాస్త్రానికి అణుగుణంగా ఉన్నదో లేదో కొలుచుకోగలిగి నప్పుడు! అప్పుడు!)
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
No comments:
Post a Comment