🙏🏻 *రమణోదయం* 🙏🏻
*ఇతర తలపులు లేవగానే వాటిని పూర్తి చేయటానికి ప్రయత్నించక, అవి ఎవరికి కలిగాయని తనను విచారించుటయే చేయదగినది.*
ఇదంతా ఇల్యూషన్
(భ్రమ..భ్రాంతి..మాయ)అని
ఉండడమే "సొల్యూషన్"
*ఆ తలపులన్నీ నాకే కదా కలుగుతున్నాయి! "నేను ఎవరు?" అని విచారణ చేస్తే మనస్సు తాను పుట్టిన స్థానానికే తిరిగి వెడుతుంది. ఎగసిన తలపులు కూడా అణగిపోతాయి.*
*నిత్యం సాధన ("ఆత్మ విచారణ") చేయగా చేయగా చిత్తశుద్ధి కలిగి, విచారణ ప్రారంభించగానే మనస్సు వెంటనే హృదయంలో నిల్చి ఉండటం అత్యంత సులభమైపోతుంది.*
*కానన దహన సమయంలో, ఆ తీక్షణమైన వేడిని భరించలేక ప్రాణులు దగ్ధమైనట్లు ఉధృతంగా సాగే "ఆత్మవిచారణ" తాపాన్ని ప్రతిఘటించలేక, హృదయంలో దాగియున్న వాసనలు తలపుల రూపంలో బయటికి వచ్చి వెనువెంటనే విచారాగ్నికి ఆహుతి అయి చివరికి వాసనలన్ని పూర్తిగా నశిస్తాయి.*
🙏🏻 *భగవాన్ శ్రీరమణ మహర్షి*🙏🏻
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.400)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి...
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం!?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment