🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సాంగత్యం*
➖➖➖✍️
*అసతాం సంగదోషేణ సాధవో యంతి విక్రియామ్*
*దుర్యోధన ప్రసంగేన భీష్మో గోహరణో గతః*
ఆరు నెలలు కలిసి వుంటే వాడు వీడువీడౌతాడనే నానుడి వినేవుంటాం. దానికి ఒక మంచి ఉదాహరణ ఈ సుభాషితం...
అసతాం అంటే అసత్యవాది, అసత్యవాది సాంగత్యంలో వుంటే సాధువుకూడా మారిపోతారు.
దుర్యోధనుడి సాగత్యంలో వుండి విష్ణుసహస్రనామం చెప్పగలిగిన భీష్ముడంతడి వాడు కూడా విరాటరాజు గోవులను దొంగిలించటానికి కూడా సిద్ధం అయ్యాడు.
అంతేనా? ...మూర్ఖ సాంగత్యంలోకి వచ్చిన ప్రతీ ఒకరూ తమ తమ స్వస్వభావాన్ని మరచిపోయి మూర్ఖ పద్దతి అవలంభించేస్తారా?```
*కాదు.. కాదు .....!*
ఈ క్రింద సుభాషితం చూడండి...
*వికృతిం నైవ గచ్ఛంతి సంగదోషేణ సాధవః*
*ఆవోష్టితం మహాసర్పైశ్చందనం న విషాయతే*
ఎలా అయితే నిరంతరమూ విషపూరితమైన సర్పాలు గంధపు చెట్లను చుట్టి పెట్టుకున్నా, గంధపు చెక్క విషపూరితం కాకుండా, తన సహజసిద్ధమైన సుగంధాలను అందరికీ పంచి పెడుతుందో, అలాగే సాధువులు, మహా పురుషులు కూడా దుస్సాంగత్యంలో వున్నంతమాత్రాన తమ సహజస్వభావాన్ని కోల్పోరు, వికృతి చెందరు.
*అదేమిటి???*
ఒక చోట మహాత్ములు కూడా సాంగత్యదోషం వలన తప్పు చేస్తారు అని., మరొక చోట అదే మహాత్ములకి సాంగత్యదోషం వుండదు అని అంటారు అని అనుమానం రావచ్చు.
అదే సనాతన ధర్మం గొప్పతనం, మనకు దారి చూపటానికి ప్రతీ విషయంలోనూ సందర్భోచితంగా వివరణతో జాగ్రత్తలు నేర్పుతుంది.
ఇదే విషయాన్ని గీతలో కృష్ణ భగవానుడు ఇలా చెబుతాడు...
*‘ఉద్ధరేదాత్మనాత్మానమ్* *నాత్మానమవసాదయేత్* *ఆత్మైవహ్యాత్మానోబంధురాత్మైవరిపురాత్మనః’*
మనిషి ఉద్ధరింపబడటానికి, అధోగతి పాలుకావడానికి తనకు తానే కారణం. అందువలను తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే తనకు బంధువు మరియు శత్రువు కూడాను, మంచి కోరటం, ఆచరించటం వలన మనస్సు బంధువుగా, మనని ఉద్ధరిస్తుంది. చెడ్డ పనులు ఆలోచనలు వలన మన మనస్సు శత్రువుగా మనలను అధోగతి పాలు చేస్తుంది.
అంటే, మనం అధోగతి పాలైనా, ముక్తి మార్గాన్ని అధిరోహించినా దానికి కారణం మన సాంగత్యం కాదు. మనో నిగ్రహంతోనే మన అధోగతి లేదా ఉన్నతి అన్నమాట.
ఇంతటి గొప్ప విషయాలను, నిత్య సత్యాలను నిక్షిప్తం చేసుకున్న భగవద్గీతను మన నిత్యజీవితంలో భాగం చేసుకొందామా మరి.✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment