పంచభూతాలు నిను ప్రశ్నించినపుడు
ఆ అనుభవం నిను నివ్వెరపరుస్తుంది
నీ కదలికలు ఆగిపోయినా
నీ శ్వాస నిలిచిపోయినా
కాలం ఆగదు.. సాగుతూనే ఉంటుంది
నిన్ను పొగిడిన నోళ్లె విమర్శలు
సంధిస్తుంటే
నీడ లా వెన్నంటే నీ పరివారమే
నిను పరిహసిస్తుంటే
నీ అస్తిత్వాన్ని నీవే ప్రశ్నిస్తావు
నిజం తెలిసి నివ్వెరపోతావు
చరిత్రను చదువు ...
ఓటమి ఎరుగని మహా
నియంతలు కాలగర్భంలో
శాశ్వతం గా నిద్రిస్తున్నారు
నీకూ ఆ రోజు వచ్చినపుడు...
నీ ఆత్మఘోష నీకు వినబడుతుంది
నీ జీవితగమనమే తడబడుతుంది.
No comments:
Post a Comment