*🌹🌹🌹🌹 బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. 🌹🌹🌹🌹*
*విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే..*
*గంజాయి మొక్కలలో పెరిగినా తులసి దైవ స్వరూపమే.*
*జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు.*
*పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాసరే.. మనకు మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం.*
*అదే సదా ఆచరణీయం.!*
*ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు" మా అబ్బాయి చాలా మంచోడండి కానీ ఫ్రెండ్స్ వల్లే పాడైపోతున్నాడు" అని.*
*ఇంకొంతమంది " మా అమ్మాయి చాలా మంచిదండి కానీ పరిస్థితుల వల్ల అలా ప్రవర్తిస్తుంది" అంటారు.*
*కానీ నిజానికి మనుషుల వల్ల పరిస్థితి వల్ల మారేది నిజమైన వ్యక్తిత్వం కాదు ఇది మనమందరం గుర్తుపెట్టుకోవాలి.*
*మనం ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగినప్పుడు నిజమైనటువంటి సన్మార్గంలో ప్రయాణించగలుగుతాం.*
*చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇదే నేర్పించాలి. ఒక గిన్నెలో పాలు, నీళ్లు ఎంతలా కలిపి పెట్టినా హంస పాలని మాత్రమే తాగి నీళ్లను వదిలేస్తుంది.*
*అంటే ఒక్క చిన్న జీవికి ఉన్న విచక్షణా జ్ఞానం మనిషికి ఎందుకు ఉండడం లేదు? అంటే మనిషికి మంచి చెడు రెండూ ఎదురైనప్పుడు చెడును స్వీకరించినంతగా మంచిని స్వీకరించడం లేదు.*
*దానికి కారణం ఏంటో తెలుసా అతని మనసు అతని ఆధీనంలో లేదు. కాబట్టి మీ మనసుని మీ ఆధీనంలో పెట్టుకోండి. అప్పుడు అన్ని శుభ పరిణామాలే జరుగుతాయి..*
*మన మనసు మన అధీనంలో ఉండాలంటే ఎంతో కొంత భగవనామస్మరణ అవసరం. యోగా, ధ్యానం అవసరం..*
*ఒక్కసారి ప్రాతఃకాలాన్నే నిద్ర లేచి, ధ్యానం చేసి చూడండి..*
*యోగ ప్రయత్నించండి.*
*మీ మనసు మీ ఆధీనంలోకి రాకపోతే అప్పుడు అడగండి. మనసు ఆధీనంలో ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే..ఏమంటారు.*
*ప్రయత్నించండి, ఆనందంగా జీవించండి...*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
No comments:
Post a Comment