చలాచల బోధ:--
శరీరం అంటే ఏమిటి?శీర్యతే ఇతి శరీరః అని శరీరానికి అర్థం.అనగా ఏది క్షీణిస్తూ చివరికి నశిస్తుందో దాని పేరు శరీరం.శరీరంలోని కణాలు అనుక్షణం అరిగి పోతూ నశిస్తూ ఉంటాయి.కాని ఆహారం తీసుకోవడం వలన క్రొత్త కణాలు సృష్టించబడుతూ ఉంటాయి.కర్మ చేయడం వలన మనలోని శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది.కర్మ చేయకపోయినా ప్రతి క్షణం గుండె కొట్టుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగడం,జీర్ణ వ్యవస్థ పనిచేస్తూ ఉండటం వంటివి మన శరీరంలో మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటుంది.వీటి. వలన కూడా శక్తి ఖర్చై శరీర కణాలు దహింపబడుతూ,నశిస్తూ ఉంటాయి.అన్నం తినడం వలన క్రొత్త కణాలు సృష్టించబడుతూ ఉంటాయి.బాల్య యౌవనావస్థలలో నశించే కణాల కంటే సృష్టింపబడే కణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరం వృద్ధి చేందుతూ ఉంటుంది.వృద్ధాప్యంలో నశించే శరీర కణాల కంటే సృష్టింపబడే కణాలు తక్కువగా ఉంటాయి.అందువలన శరీరం కృశిస్తూ ఉంటుంది.కావున మనం నా శరీరం అని ఎప్పుడూ అంటున్నాము అంటే దాని అర్థం తెలిసిన వారికి ఈ బొంద పోయేదే,ఈ బొంద పోయేదే అని మననం జరుగుతూ ఉంటుందన్న మాట!
No comments:
Post a Comment