*✍🏻 నేటి కథ ✍️*
*🐢స్నేహితుడి సహాయం🐆*
ఒక చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువుకు దగ్గరలో ఉండే ఒక నక్కతో దానికి స్నేహం ఏర్పడింది. ఒకరోజున వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిరుతపులి వచ్చింది. అది గమనించిన
నక్క తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ నివాసస్థానాలవైపు
పరుగెత్తాయి. నక్క మాత్రం వేగంగా పరుగెత్తి తన బొర్రెలోకి దూరింది. తాబేలు
మెల్లగా నడుస్తుంది కాబట్టి తన చెరువును చేరుకోలేకపోయింది. చిరుతపులి
ఒక్క గంతులో దాన్ని చేరుకొంది. తాబేలుకు ఎక్కడా దాక్కోడానికి అవకాశం చెట్టు చిక్కలేదు. చిరుతపులి తాబేటిని నోట కరచుకొని, దాన్ని తినడానికి ఒక కిందకి తీసుకువెళ్ళింది. కాని, తన పళ్ళతోను, గోళ్ళ బలంతోను ఎంత
ప్రయత్నించినా తాబేలు పైనున్న పెంకును కొరకలేక పోయింది. నక్క తన
బొర్రెనుంచి ఇదంతా చూస్తూ ఉంది. దానికి తన స్నేహితుడైన తాబేలును
కాపాడే ఒక ఉపాయం తోచింది. బొర్రెనుంచి తొంగి చూస్తూ నక్క అమాయికంగా ఇలా అంది: "చిరుతపులిగారూ! తాబేలు శరీరం పైనున్న
పెంకును సులభంగా కొరికే మార్గం చెబుతాను.దాన్ని నీటిలోకి విసరండి.
కొద్దిసేపట్లోనే అది నానుతుంది. దానిమీదున్న పెంకు మెత్తనవుతుంది. కావలిస్తే పరీక్షించి చూసుకోండి," అంది.
చిరుతపులి, "సరే! ఇప్పుడే పరీక్షిస్తాను" అని తాబేటిని నీటిలోకి విసిరేసింది.
ఇంకేమి! తాబేలు చెరువునీటిలో హాయిగా ఈదుకుంటూ నీటి అడుగుకు చేరింది.
తాబేలు రాకకోసం ఎదురుచూస్తూ గట్టునే ఉండిపోయింది చిరుతపులి.
No comments:
Post a Comment